..

Friday 7 October 2016

శ్రీవారి బ్రహ్మోత్సవాలు. : గరుడ వాహనం


 


బ్రహ్మోత్సవాలలో అయిదో రోజు శుక్రవారం రాత్రి మలయప్ప స్వాములవారు ఊరేగే వాహనం గరుడ వాహనం.
మూలవిరాట్టుకున్న మకరకంఠీ,లక్ష్మిహారం మొదలైన వాటిని ఉత్సవమూర్తులకు అలంకరించడం ఈ వాహనం నాటి ప్రతేయ్కత.తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి అండాళ్ అలంకరించుకున్న పూలమాలను స్వామికి అర్పించడం మరో ప్రతేయ్కత. అలాగే కాలినడకన మదరాసు నుండి తేచ్చిన గోడుగుల్న్ని ఈ స్వామి గ్రహించడం,ఉరేగించడం, ఇంకొక ప్రతేయ్కత.అంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆనవాయితిగా పట్టు వస్త్రాలు పంపడం, స్వామివారు ధరించడం మరొక ప్రతేయ్కత
కొత్త గొడుగుల నీడలో ,బంగారు గరుడునిఫై వెంచేసి వరదహస్తుడై స్వామి తిరువిదులలో ఉరేగడం రమణీయమయిన దృశ్యం,పదిరోజులు జరిగే బ్రహ్మోత్సవాలలో ఇది పరాకాష్ఠ. 

గరుత్మంతుడు నిత్యసూరి,స్వామికి దాసుడు,సఖుడు,వాహనం, పతాకచిహ్నం,గరుత్మoతునికి తెలియని స్వామి రహస్యాలు లేవు. గరుడని `పెరియతిరువడి` అనడం వైష్ణవ సంప్రదాయం. గరుడారూదుడైన ఈ స్వామిని అన్నమయ్య వర్ణించిన తిరు మనోహరం.

హనుమద్వాహనం.
బ్రహ్మోత్సవాలలో ఆరవనాటి ఉదయం స్వామివారు ఊరేగే వాహనం హనుమద్వాహనం. త్రేతాయుగంనాటి రాముడే వేంకటేశ్వరుడని నిరూపించడం ఈ వాహనంలోని పరమార్దం.వైష్ణవులు హనుమంతుని `సీరియత్తిరుమడి` అంటారు. గరుత్మంరుడు పెరియత్తిరువడి. బృత్యుల్ని కూడా మన్నించి వారికీ ఉపకారం చేయడం ప్రభువుల విధి. శ్రీరాముడే దేవుడని కొలిచిన భక్తుడు హనుమంతుడు.తన భక్తితత్పరతను చాటిన హనుమంతుడు ద్వార భక్తులు స్పూర్తి పొందడానికి వీలుగా హనుమంత వాహనంఫై స్వామి ఉరేగడం ప్రతేయ్కత. సాయంవేళా స్వర్ణరధసేవ జరగడం విశేషం
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com