..

Saturday, 9 November 2013

మనం పూర్వజన్మలో చేసిన తప్పుల వలన ఇప్పుడు అనుభవిస్తున్న శిక్షలు.

కొందరు ఐశ్వర్యంతో సుఖిస్తున్నారు. మరికొందరు పుట్టినప్పటినుండి ఐశ్వర్య విహీనులై దుఖిస్తున్నారు. దీనికి ఏమి కారణం.
పూర్వజన్మలో లేమితో దుఃఖిస్తున్న భాందవులను, ఆత్మీయులను, ఆదుకున్నవారిని ఈ జన్మలో అష్టైశ్వర్యాలు అవలీలగా లభిస్తున్నాయి. దారుణలోభంతో కుంచించుకు పోయిన కుత్సితులు సంపదలు లేక దుఖిస్తున్నారు. విధాతకు ఎవ్వరి యందు ప్రేమకాని, ద్వేషం కాని లేదు. వారి వారి ఖర్మల ఫలితమే నేటి జన్మలో సుఖ దుఃఖాలకు కారణం.
పుష్కలంగా సంపద ఉన్నా అనుభవించని కష్టాత్ముడు గతజన్మలో ఇతరులు ఎన్నెన్నో విధాల బలవంతపెట్టినప్పుడు మాత్రమే ఉపకారాలు ఆచరించిన పరమలోభులు. తమకు ఏమాత్రం సంపద లేకపోయినా వేరేవారి తోడ్పాటువలన భోగాలు అనుభవిస్తున్నవారు పూర్వజన్మలో పేదవారై ఉండి కూడా అర్ధించినవారికి ఏదోవిధంగా సాయపడవలేనని ఆత్రపడిన సత్పురుషులు. అనాయాసంగా సంపద చేరుకున్న అదృష్టవంతులు, తమంటతామే అర్హులైనవారిని ఆహ్వానించి విత్తమిచ్చిన వితరణఖనులు. బాగా శ్రమించిన పిదప సొమ్ము చేరినవారు అర్హులు అడిగినప్పుడు గాని విత్తమీయనివారు. ఎన్నెన్ని విధాల శ్రమించినా ధనము ఏమాత్రమూ లభించని దురదృష్టవంతులు పూర్వం యాచకులని అదిగో ఇదిగో అని తిప్పి చిట్టచివరికి ఇవ్వక తిరస్కరించిన పాపులు. ముదిమిలో ధనవంతులైన మానవులు పూర్వజన్మలో ప్రాయంలో దానధర్మాల మాటే తలపెట్టక జవసత్వాలు ఉడిగిన పిమ్మట దానధర్మాలు ఆచరించిన అలుసులు. మహాధనవంతులై నిరంతర రోగాల వల్ల భోగాలు అనుభావించలేనివారు పూర్వజన్మలో ఐశ్వర్యవంతులైనా దానధర్మాల మాటే తలపెట్టక మరణసమయంలో దానాలకు ఉపక్రమించిన అవివేకులు.. మహా సౌందర్యవంతులు వెనుకటి జన్మలో మాంసం విసర్జించిన మహనీయులు. రూపవిహీనులు పూర్వం సుందరులై కురూపులను అపహసించిన దురహంకార దూషితులు. 
పత్ని యెడల అన్యోన్యతతో చిరకాలం సౌక్యలు అనుభవించిన వ్యక్తి పూర్వం పరకన్యలపై కన్నెత్తి చూడని సత్పురుషుడు. అనుకూలం లేని దాంపత్యంతో అలమటించి అనతికాలంలో భార్యవియోగంతో అలమటించే పురుషుడు ముందు జన్మలో భార్యని ఏమాత్రం సుఖపెట్టని వాడు. మహనీయ విజ్ఞానఖని అయినా లేమితో సతమతమయ్యే వారు పూర్వం సిరిసంపదలు వున్నా దానం మాటే తలపెట్టని పరమలోభి. విత్తసంపత్తి కలిగినా బుద్దిసంపత్తి లేని మనిషి ముందు జన్మలో ప్రజ్ఞ లేకపోయినా కారుణ్య దృష్టితో దీనులను ఆదరించిన ఆర్ద్ర హృదయుడు. విద్యావంతుడైన మేధావి, ఆచార్యునికి ఏంటో అడకువతో పరిచర్యలాచరించి తన పాండిత్య సంపద ఒరులకి అర్పించవలెనని ఆత్రుతపడిన మహితాత్ముడు. ఎన్నెన్ని విధాల ప్రయత్నించినా చదువు అబ్బనివాడు, విధ్యాగర్వంతో మిక్కిలి మదించి మైమరచి సభలలో సాధు విద్వాంసులని అవమానించి ఈసడించిన దుర్గర్వితుడు. నిరంతరారోగ్యంతో భార్యపుత్రులతో మహైశ్వర్యంతో సుఖిస్తున్న భోగి పూర్వం సత్పురుషులని ఎందరెందరినో మిక్కిలి ఆత్మీయతతో ఆదరించిన మాన్యశేఖరుడు. దుష్టులైన భార్య పుత్రులతో సదా లేమితో రోగాలతో దుఃఖిస్తున్న మానిసి పూర్వం క్రోధ,లోభ,నాస్తికత్వాలతో పరులని ఇనుమిక్కిలిగా పీడించిన దురాత్ముడు. పుట్టుగుడ్డి గతజన్మలో అందగాడై తన సోయగంతో మైమరచి ఇతరుల భార్యలని ఆకర్షించిన పరమపాపి. కర్ణరోగార్తుడు(చెవిటివారు) ముందు పుట్టుకలో కటువైన మాటలతో సజ్జనులను ఎంతో మానసికవ్యధ కలిగించిన కటినుడు. ఉదర రోగాములతో బాధపడేవారు గతజన్మలో విషభోజనంతో పరులను అన్యాయంగా వేధించిన ధురాత్ముడు.పరుల భార్యలని గాని, కన్యలని గాని పూర్వజన్మలో మధాందుడై అనుభవించిన దురాత్ముడు, నీరుపట్టిన శరీరంతో గాని మధుమేహంతో గాని ఇనుమిక్కిలిగా దుఃఖించగలడు. దురహంకారంతో మైమరచి కాళ్ళు చేతులు విరిచి పరులని భాదించిన పాపి కుంటివాడై జన్మించగలడు. కత్తులతో,కర్రలతో, దారుణ ప్రహరణాలతో సజ్జనులను అన్యాయంగా హింసించిన దుష్టులు కంతులు మొదలైన దుస్సహ చర్మరోగాలతో దుఃఖించగలరు. అల్పులని అన్యాయంగా కాలితాపులతో(కాళ్ళతో తన్నడం),పరిశుభ్రతలేని పదాలతో దేవాలయాలలో ప్రవేశించినా ఉత్తరజన్మలో తప్పక చరణ రుగ్మతలు(కాళ్ళకు సంభందించిన రోగాలు) ఏర్పడగలవు. జ్వరము, అతిసారము, మహోదరము, వాత పిత్త కఫాల దారుణోద్రేకాలతో ఆదిగా గల రోగాలతో యాతనలు అనుభవిస్తున్న మానవులందరు పూర్వజన్మలో వినోధార్ధమై ప్రాణులని సంహరించిన(మాంసాహారం తినడం కూడా) పాపాత్ములు. ధాన్యాల వ్యాపారాలలో కల్తి కలిపిగాని, తప్పుడు తూకలతో వ్యవహరించి లాభాలు ఆర్జించిన పాపాత్ములు గూని, కాళ్ళులేమి, మరుగుజ్జుతనము అన్న రోగాలతో సదా అలమటించగలరు. ఈజన్మలో సజ్జనులను అన్యాయంగా మోసగించి సొమ్ము చేజిక్కించుకున్న కపటాత్ముడు మతిభ్రంశంతో దుఃఖించే వారు. ఈజన్మలో పితృకార్యాలు వదిలేసినా, పసివారిని సంహరించినా, ముందు పుట్టుకలో సంతానం కలగదు. తప్పేమిలేకపోయినా పిరుదుల మధ్య భాదినా, సాంగత్య సుఖానికి అడ్డంకి కలిగించినా నపుంసకత్వం వస్తుంది. భర్తని వంచించి సొమ్ము కూడబెట్టినా, సౌందర్య గర్వంతో పరాయివారి భర్తలని ఆకర్షించినా, అపహరించినా(వేరేవారి భర్తతో లేచిపోవడం) కొద్దికాలంలోనే వితంతువు అవుతుంది.
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com