..

  • This is featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

  • This is featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

  • This is featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

Monday, 3 October 2016

ముద్గల పురాణాన్ని అనుసరించి 32 మంది గణపతులు ఉన్నారు.

1. బాల గణపతి 2.తరుణ గణపతి 3.భక్త గణపతి 4.వీర గణపతి
5. శక్తి గణపతి 6.ద్విజ గణపతి 7.సిద్ధ గణపతి 8.ఉచ్చిష్ట గణపతి
9.విఘ్న గణపతి 10.క్షిప్ర గణపతి 11.హేరంబ గణపతి 12.లక్ష్మీ గణపతి
13.మహా గణపతి 14. విజయ గణపతి 15.వృత్త గణపతి
16. ఊర్ద్వ గణపతి 17.ఏకాక్షర గణపతి 18.వర గణపతి 19.త్ర్యక్షర గణపతి 20.క్షిప్ర ప్రసాద గణపతి
21.హరిద్రా గణపతి 22.ఏకదంత గణపతి 23.సృష్టి గణపతి 24.ఉద్ధండ గణపతి
25.ఋణ మోచన గణపతి 26.దుండి గణపతి 27.ద్విముఖ గణపతి 28.త్రిముఖ గణపతి
29.సింహ గణపతి 30.యోగ గణపతి 31.దుర్గా గణపతి 32 .సంకష్ట గణపతి
ఈ గణపతి రూపాల్లో మొదటి 16 గణపతులు చాలా మహిమాన్వితమైనవి. వీటిని "షోడశ'' గణపతులు అంటారు.
నంజనగూడు దేవాలయంలో ఉన్న 32 గణపతి విగ్రహాల పేర్లలో 15 పేర్లు మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న పేర్లతో సరిపోలుతున్నాయి. తక్కినవి వేరుగా ఉన్నాయి. ఈ అంశాన్ని మైసూరు ప్రాచ్య పరిశోధనా సంస్థ వెల్లడించిన నివేదిక కూడా పేర్కొంది.

విద్యార్ణవ తంత్రంలో గణపతి రూపాల్లో 15 విభేదాలు కనిపిస్తాయి.
1. ఏకాక్షర గణపతి 2.మహా గణపతి 3. క్షిప్ర గణపతి
4. వక్రతుండ గణపతి 5. లక్ష్మీ గణపతి 6. హేరంబ గణపతి
7. వీర గణపతి 8.లక్ష్మీ గణపతి 9. శక్తి గణపతి
10. సుబ్రహ్మణ్య గణపతి 11. మహా గణపతి 12. త్రైలోక్య గణపతి
13. హరిద్రా గణపతి 14. వక్రతుండ గణపతి 15. ఉచ్చిష్ట గణపతి
ఇందులో రెండు మహా గణపతులు ఉన్నాయి. కాగా మూడు లక్షణాలు ఉన్న గణపతులు కనిపిస్తున్నాయి. లక్ష్మీ గణపతులు రెండు, వక్రతుండ గణపతులు రెండు, శక్తి గణపతి లక్షణాలు అయిదు, త్రైలోక్య మోహన గణపతి లక్షణాలు రెండు, వీర గణపతి లక్షణాలు రెండు, ఉచ్చిష్ట గణపతి లక్షణాలు రెండు స్పష్టమౌతున్నాయి.

శిల్ప ఆగమ శాస్త్రాలను అనుసరించి 21 గణపతుల రూపాలు ఉన్నాయి. అవి వరుసగా...
1.వినాయకుడు 2.బీజ గణపతి 3.హేరంబ గణపతి 4.వక్రతుండ గణపతి
5.బాల గణపతి 6.తరుణ గణపతి 7.భక్తి విఘ్నేశ 8.వీర విఘ్నేశ 9.శక్తి గణేశ
10.ధ్వజ గణపతి 11.పింగళ గణపతి 12. ఉచ్చిష్ట గణపతి 13. విఘ్నరాజ గణపతి
14.లక్ష్మీ గణేశ 15.మహా గణేశ 16. భువనేశ గణపతి 17.నృత్త గణపతి
18.ఊర్ద్వ గణపతి 19.ప్రసన్న గణపతి 20.ఉన్మత్త వినాయక 21.హరిద్రా గణేశ.
విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో తాంత్రికులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 33 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు.
ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిదీ ఒక్కో విశిష్టత.

1. బాల గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.
కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్
బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్
అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి.

2. తరుణ గణపతి:
ఈ వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు. ఈయనను...
పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంత శాలీనమపి స్వహస్త్రైః ధత్తే సదా య సతరుణాభః పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః అనే మంత్రంతో పూజించాలి.

3. భక్త గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...
నాలికేరామ్ర కదలీ గుడపాయాస ధారిణమ్
శరచ్చంద్రాభ్వవుషం భజే భక్త గణాధిపమ్
అనే మంత్రతో స్తుతించాలి...ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.

4. వీరగణపతి
ఈ వినాయకుడి రూపానికి పదహారు చేతులుంటాయి కుడి వైపు చేతులతో బాణం, బేతాలుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం, గొడ్డలిబొమ్మ ఉన్న జెండా, ఎడమవైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి దర్శనమిస్తారు. ఈయనను....
బేతాల శక్తి శర కార్ముక చక్ర ఖడ్గ
ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్
శూలం చ కుంత పరశుధ్వజ మాత్తదంతం
వీరం గణేశ మరుణం త్వనిశం స్మరామి
అనే మంత్రంతో కీర్తించాలి. ఈయనను పూజించిన భక్తులకు తిరుగులేని ధైర్యం ప్రసాదిస్తారు.

5. శక్తి గణపతి
ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం
పరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్
సంధ్యారుణం పాశ స్ఫటీర్దధానం
భయాపహం శక్తి గణేశ మీదే
అనే మంత్రంతో ఈ గణేశుని ప్రార్థించాలి. నాలుగు చేతులున్న ఈ గణపతి అంకుశం, పాశం,
విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు. ఈయన కరుణిస్తే ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.

6. ద్విజ గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పుస్తకం, దండం ఎడమవైపు ఉన్న చేతులతో అక్షమాల, కమండలం పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...
యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీః
విద్యోతమాన కరభూషణ మిందువర్ణమ్
స్తంబేరమానవ చతుష్టయ శోభమానం
త్వాం ద్విజగణపతే ! సిద్ధ్విజ గణాధిపతే స ధన్యః అనే మంత్రంతో పూజించాలి. ఈ గణపతి తెలివి తేటలు ప్రసాదిస్తాడు.
7. సిద్ధి (పింగల) గణపతి
ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పండిన మామిడిపండు, ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....
పక్వచుత ఫల పుష్పమంజరీ
ఇక్షుదండ తిలమోదకై స్సహ
ఉద్వహన్ పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత హేమం పింగల
అనే మంత్రంతో స్తుతించాలి.

8. ఉచ్ఛిష్ట గణపతి
కోరిన కోర్కెలు తీర్చే ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మపండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....
నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్
దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః
అనే మంత్రంతో ప్రార్థించాలి.

9. విఘ్న గణపతి
గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడివైపు చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...
శంఖేక్షు చాప కుసుమేషు కుఠార పాశ
చక్ర స్వదంత సృణి మంజరికా శరౌఘై
పాణిశ్రిఅఅఅ పరిసమీహిత భూషణా శ్రీ
విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః అనే మంత్రంతో ప్రార్థించాలి.

10. క్షిప్త గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ ఎడమ వైపు ఉన్న చేతులతో కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి కనిపిస్తారు. ఈయనను....
దంత కల్పలతా పాశ రత్న కుంభాంకుశోజ్జ్వలమ్
బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర గణాధిపమ్
అనే మంత్రంతో స్తుతించాలి.

11. హేరంబ గణపతి
అభయ వరదహస్త పాశదంతాక్షమాల
సృణి పరశు రధానో ముద్గరం మోదకాపీ
ఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రం
గణపతి రతిగౌరః పాతు హేరంబ నామా
అనే మంత్రంతో స్తుతించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమవైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తారు. ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారు.

12. లక్ష్మీ గణపతి
బిభ్రాణ శ్శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశన్
పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్జ్యోతి స్సుధా నిర్ఘరః
శ్యామేనాత్తసరోరు హేణ సహితం దేవీద్వయం చాంతికే
గౌరాంగో వరదాన హస్త సహితో లక్ష్మీ గణేశోశావ తాత్ అనే స్తోత్రంతో పూజించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తారు. ఈ సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.

13. మహాగణపతి
ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలూ కలుగుతుంది.
హస్తీంద్రావన చంద్రచూడ మరుణచ్చాయం త్రినేత్రం రసాదాశ్యిష్టం శిరయమాస పద్మకరయా స్వాంకస్థయా సంతతమ్
బీజాపూరగదా ధనుర్విద్య శిఖయుక్ చక్త్రాబ్ద పాశోత్పల
వ్రీహ్యగ్ర స్వవిశాణ రత్న కలశాన్ హస్త్రై ర్వహంతం భజే
అనే మంత్రంతో ప్రార్థించాలి.

14. విజయ గణపతి
సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని....
పాశాంకుశ స్వదంత్రామ ఫలావా నాఖు వాహనః
విఘ్నం నిఘ్నంతు నమః స్సర్వం రక్తవర్ణో వినాయకః అనే మంత్రంతో పూజించాలి.

15. నృత్య గణపతి
సంతృప్తిని, మనశ్శాంతినీ ఇచ్చే ఈ గణపతి కుడి చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి దర్శనమిస్తారు.
పాశాంకుశాపూస కుఠారదంతః చంచత్కరః క్లుప్త పరాంగులీకుమ్
పీతప్రభం కల్పతరో రథః స్థం భజామి తం నృత్త పదం గణేశమ్
అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.

16. ఊర్ధ్వ గణపతి
కారాగార బాధ నుండీ తప్పించే ఈ గణపతి కుడి చేతులలో కలువ, పద్మం, విల్లు, విరిగిన దంతం, ఎడమ వైపు చేతులతో వరివెన్ను, చెరకుముక్క, బాణం, మొక్కజొన్న కండె ధరించి దర్శనమిస్తారు.
కల్హార శాలి కమలేక్షుక చాపదంతా ప్రరోహ కనకోజ్జ్వల లాలితాంగ ఆలింగ్య గణోద్యతకరో హరితాంగ యష్ట్యా దేవ్యా కరోతు శుభమూర్ధ్వ గణాధిపో మేః అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.
Share:

ద్వాదశ జ్యోతిర్లింగాలు

     ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .......
దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది .

మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి .
ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు .
ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -- ద్వాదశ జ్యోతిర్లింగాలు -- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --

శైవులు శివున్ని మూర్తి రూపములో మరియు లింగరూపములోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు. ప్రతి లింగములో శివుని యొక్క జ్యోతి స్వరూపము వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావించబడుచున్నది.

నీ పుట్టుకే నీకు తెలియనివాడివి, నా పుట్టుకకు నీవు కారకుడివా..!? కానేకావు. నాకు నేను స్వయంగా అవతరించాను. నాపై నీ ఆధిపత్యం చెల్లదు. నేనే నీక న్నా అత్యధికుడిని అంటూ బ్రహ్మ వాదులాడసాగాడు. విష్ణువు ఎన్నివిధాల నచ్చజెప్ప ప్రయత్నించినప్పటికీ... బ్రహ్మ వినకుండా నేనే అధినాథుడను... ఈ విశ్వానికి నేనే అధినాథుడను అంటూ పెడబొబ్బలు పెట్టసాగాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఫెళఫెళమంటూ విశ్వమం తా కంపించిపోయింది. ఆ ఆర్భాటాలకి హేతువేమిటో తెలియక బ్రహ్మ విష్ణువులు విస్మయం చెందుతూ అటూ ఇటూ చూడసాగారు.

లింగోద్భవం: ఆ సమయంలో ఓంకారనాదం ప్రతిధ్వనిస్తుండగా... జ్వాలా స్తంభం ఒకటి వారిరువురి మధ్య ఆవిర్భవించింది. సహస్రాధిక యోజనాల పొడ వుగా ఉద్భవించింది ఆ స్తంభం. అగ్నిజ్వాలలు విరజి మ్ముతున్న ఆ జ్యోతిర్లింగం ఆది మూలమెక్కడో, తుది యేదో... ఎక్కడున్నదో కూడా వారికి అర్థం కాలేదు. ఆ జ్వాలా స్తంభం యొక్క ఆద్యంతాలు తెలుసుకోగలిగిన వాడే తమలో అధికుడని వారిరువురూ నిశ్చయించుకు న్నారు. ఆ నిర్ణయానుసారం బ్రహ్మ హంసరూపం దా ల్చి జ్యోతిర్లంగం తుది భాగాన్ని కనుక్కోవడానికి పైకెగి రి వెళ్లాడు. విష్ణువు ఆ లింగం అడుగు భాగాన్ని కను క్కోవడానికి యజ్ఞ వరాహరూపం ధరించి లింగం ప్రక్క నుంచి భూమిని తొలుచుకుంటూ అడుగు భాగానికి ప్రయాణం ఆరంభించాడు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు.

ఆ జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని కను క్కోవడం తనకు సాధ్యం కాదని గ్రహించి వెనుదిరిగి యథాస్థానానికి వచ్చి బ్రహ్మకోసం నిరీక్షించసాగాడు. బ్రహ్మ పైకి ఎన్ని యోజనాలు ప్రయాణించినా ఆ లిం గం తుది భాగాన్ని కనుక్కోలేక నిరాశ చెందాడు. ఆ స మయంలో విష్ణువు దేవాదిదేవా..! ఆద్యంతాలు లేని ఈ జ్వాలా లింగాన్ని అభిషేకించడం, అర్చించడం మాకు సాధ్యం కాదు. కావున, నీవు ఈ జ్వాలా స్వరూపాన్ని ఉపసంహరించుకొని, మా పూజలందుకోవడానికి అర్హమైన రూపంతో అవ తరించు అని ప్రార్థించాడు. విష్ణువు ఆ ప్రార్థనతో శాంతించిన పరబ్రహ్మ తన జ్వాలా స్తంభరూపాన్ని ఉపసంహరించుకున్నాడు.

మరుక్షణమే ఆ ప్రదేశం లో మొట్టమొదటి శివలింగం అవతరించింది. లింగో ద్భవం జరిగిన ఆ సమయమే ‘మహాశివరాత్రి’ పర్వది నం అయింది. శివలింగరూపంలో అవతరించిన పర మేశ్వరుణ్ణి పవిత్ర జలంతో అభిషేకించి..శివనామస్మ రణతో పంచాక్షరీ మహామంత్రంతో అర్చించారు బ్ర హ్మ, విష్ణువులు. వారి భక్తి ప్రపత్తులకు సంతోషిం చి ఆదిదేవుడు ఆ లింగాకార మధ్యభాగంలో ప్రత్యక్ష మై దర్శనమిచ్చి వారిని ఆశీర్వదించి అనుగ్రహించాడు.

ద్వాదశ జ్యోతిర్లింగాలు: లింగమనగా... ‘లీయతేగమ్యతే ఇతి లింగః’...
‘లిం’ లీయతి, ‘గం’ గమయతి... అనగా ఈ
జగత్తు దేనియందు సంచరించి, దేనియందు
లయం చెందుతుందో అదే ‘లింగము’ అని అర్థం.

ఆద్యంతాలు లేనిదే లింగము. లింగతత్త్వమే ఆత్మ. కనుక ప్రతి దేహంలో ఆత్మ అనే లింగము ఉంటున్నది. ఆ లింగస్వరూపుడే శివుడు.

అగమ్యము, అగోచరమైన దివ్య తత్త్వమును మానవులు గ్రహిచటానికి నిదర్శనముగా లింగము ఉద్భవించుచున్నది. లింగము అనంత నిరాకార పరబ్రహ్మమునకు చిహ్నం. ఈ సత్యాన్ని చాటడానికి ఆ పరబ్రహ్మ తొలుత లింగరూపుడై ఉద్భవించి బ్రహ్మ, విష్ణువులకు దర్శనమిచ్చాడు. అనంతరం లింగాకారుడై ముల్లోకాలలోనూ వెలసి నిత్యాభిషేక అర్చనలు అందుకుంటున్నాడు. భక్తులు, సర్వజీవుల హృదయాలలో ఆత్మరూపుడై నివశించే శివుడు ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ తనని పూజించడానికి వీలుగా కోటానుకోట్ల శివలింగాలై వెలసి ఉన్నాడు. ఇట్టి అనేకానేక శివలింగాలలో దాదాపుగా అన్ని ప్రతిష్ఠించినవి కాగా... కొన్ని మాత్రమే ఆ శివుడు తనకుతానుగా స్వయంగా లింగరూపుడై వెలిసినవి. వాటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవే ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర ‘లింగపురాణం’లో వ్యాసమహర్షి వివరించాడు.

అవి -->
రామనాథస్వామి లింగము - రామేశ్వరము, మల్లికార్జున లింగము - శ్రీశైలము, భీమశంకర లింగము - భీమా శంకరం, ఘృష్టీశ్వర లింగం - ఘృష్ణేశ్వరం, త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరం, సోమనాథ లింగము - సోమనాథ్, నాగేశ్వర లింగం - దారుకావనం (ద్వారక), ఓంకారేశ్వర-అమలేశ్వర లింగములు - ఓంకారక్షేత్రం, మహాకాళ లింగం - ఉజ్జయని, వైధ్యనాథ లింగం - చితా భూమి (దేవఘర్), విశ్వేశ్వర లింగం - వారణాశి, కేదారేశ్వర - కేదారనాథ్.

1 . గుజరాత్‌లో శ్రీ సోమనాథేశ్వరుడు
గుజరాత్‌ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికీ ప్రజ్వరిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమ నాథేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి.
.
2 . శ్రీశైల మల్లికార్జునేశ్వరుడు
మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా దోర్నాల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి 52 కిలోమీటర్ల, హైదరాబాద్‌కు 230 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభువుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిశాడు. భూ ప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే గణాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షన్ముఖుడికి ప్రతీచోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు. పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్లిపోయి కార్తీకుడిగా వెలిశాడు. తన తప్పిదం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానదీ తీరం శ్రీశైల శిఖరంలో తప్పస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ సహిత మల్లిఖార్జునులుగా వెలిశారు. శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన వేయి లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన అయిదు లింగాలు ఇక్కడే కొలువు తీరినట్లు చెబుతారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానందాలహరి రాసారని ప్రతీతి.

3 . శ్రీ మహా కాళేశ్వరుడు
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఉజ్జయినీ పట్టణంలో శ్రీ మహా కాళేశ్వరాలయం ఉంది. క్షిప్ర నదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది. ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీచక్రయంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహా కాళేశ్వరుడికి పాతఃకాలం భస్మాభిషేకం చేస్తారు. ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు.

4 . శ్రీ ఓంకారేశ్వరుడు
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం వింద్య పర్వత సానువుల్లో నర్మదానది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. సంస్కృత ఓం ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం.

5 . శ్రీవైద్యనాథేశ్వరుడు
జార్ఖండ్‌ రాష్ట్రంలో జేసిడీ కూడలి దగ్గర శ్రీవైద్యనాథేశ్వరాలయం ఉంది. పాట్నా నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కట్నీపూర్‌ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండింటి నేపథ్యమూ రామాయాణాంతర్గత రావణాసురిడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయం మవుతుండడం వల్ల శ్రీవైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారని ప్రతీతి.

6 . శ్రీభీమేశ్వరుడు
మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతఘాట్‌లో పూణేకు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమనది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసింది. కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది. ఈ జ్యోతిర్లింగం అర్థనాథేశ్వర రూపంలో భక్తులు కోర్కెలు తీర్చేదిగా ప్రతీతి. ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుండడం ఓ ప్రత్యేకత. శివుని రౌద్రరూపం నుంచి వచ్చిన చెమట బిందువులు భీమనదిగా మారిందని స్థల పురాణం.

7 . శ్రీరామేశ్వరుడు
తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వరాలయం ఉంది. పురాణగాథ ప్రకారం రావణవధ అనంతరం శ్రీరామచంద్రమూర్తి సేతువును దాటి భారతదేశానికి వస్తాడు. బ్రహ్మ హత్యాపాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమకు ఆజ్ఞాపిస్తాడు. సుముహూర్త సమయం దాటిపోతుండడంతో సీతాదేవి సముద్రతీరంలో ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించింది. ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుక లింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు. గర్వభంగమైన ఆంజనేయుడు శివునికి పక్కనే తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. రామేశ్వరంలో రెండు లింగాలు మనం గమనిస్తాం. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి. రామేశ్వరంలోని నూతుల్లో నీటితో స్నానమాచరిస్తే సమస్త బాధలు పోతాయని భక్తుల విశ్వాసం.

8 . శ్రీనాగనాథేశ్వరుడు
మహారాష్ట్ర ప్రభాస రైల్వేస్టేషన్‌కు సమీపంలో శ్రీనాగనాథేశ్వర ఆలయం ఉంది. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినపుడు శరీరం నిండా పాములు, చేతుల్లో త్రిశూలాలు ధరించిన నగ్నకాపాలికులు వారిని తరిమికొట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి.

9 . శ్రీవిశ్వనాథేశ్వరుడు
శ్రీ విశ్వనాథేశ్వరుడి జ్యోతిర్లింగం వారణాసిగా జగత్‌ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్రంలో ఉంది. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీపట్టణం. గంగానది తీరంలో బౌద్ధ, జైన మతాలవారు, హైందవులు అనేకమంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు. అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలను కలిగి ఉంది. విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్ష్మి శక్తిపీఠం ఉంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానదీ తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నాన, దాన, హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి.

10 . శ్రీత్రయంబకేశ్వరుడు
మహారాష్ట్రలోని నాసిక్‌కు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబుకేశ్వరాలయం ఉంది. బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా వెలసి బ్రాహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలందుకొన్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

11 . శ్రీ కేధారేశ్వరుడు
ఉత్తరాంచల్‌ రాష్ట్రంలో కేదారేశ్వలయం ఉంది. హిమాలయశిఖరం మందాకిని నదీతీరంలో సముద్ర మట్టానికి 3585 మీటర్ల ఎత్తులో ఎద్దుమూపుర ఆకారంలో ఉందీ జ్యోతిర్లింగం. గౌరీకుండ నుంచి 14కిలోమీటర్ల దూరం గుర్రాలుపై గానీ, డోలీలో గానీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి నవంబరు నెల వరకే ఈ ఆలయం తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కల్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి. అంతరాలయంలో నేటికీ పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి. ఆదిశంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆదిదంపతుల కళ్యాణసమయంలో హోమగుండం, నేటికీ దర్శించవచ్చు. హరిద్వార్‌ నుంచి గౌరీకుండ్‌ వరకు బస్సు మార్గం ఉంది. 

12 .శ్రీ ఘృష్ణేశ్వరుడు
మహారాష్ట్ర ఔరంగబాద్‌ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీవిఘ్నేశ్వరాలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో ఘృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు, దేవగిరి కొండపై ఘృష్ణేశ్వరుని ఆలయం వెలిసింది.

గంగానది పుట్టు పూర్వోత్తరాలు

        నదులు పుట్టుక ప్రకృతి పై ఆధారపడి వర్షాధారముగానో , మంచు కొండలలోని మంచు కరగడము వలనో చిన్న పాయలు , వాగులు , సెలయేళ్ళు కలయిక వలన పల్లపు ప్రంతాలకు ప్రవహించడము వలన యేర్పడుతూ ఉంటాయి. ఇది ప్రకృతి సహజము . కాని మన హిందూ పురాణాలలో వ్యాసమహర్షి రచనలవలన అంతా దైవకృపవలనే జరిగినట్టుగా వ్రాయబడినది . కదో , నిజమో చరిత్ర కారులకే తెలుస్తుంది . ప్రస్తుతానికి ఇది ఒక పురాణ కధగానే చెప్పుకుంటున్నాము .

"గంగాధరా హర హర నమో" అని శివుణ్ణి ప్రార్ధిస్తాము . గంగను ధరించిన ఓ శివా నీకు నమష్కారము అని అంటాం. మరి ఆ గంగాదేవి ఎప్పుడు అవతరించినట్లూ , అంటే అందుకో పౌరాణిక కధ ఉంది. గంగాదేవికి అత్యంత ఇష్టమైన రోజూ , ఆమె ను అంతా పూజించవలసిన రోజూ ఏదంటే ... ఆ రోజే " గంగా సప్తమి " అనగా వైశాఖ శుక్లపక్ష సప్తమి -- గంగా సప్తమి .

కధ :
ఒకప్పుడు సగరుడు అనే సూర్యవంశ రాజు ఉండేవాడు . సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అంశుమంతుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సాగరరాజు అశ్వమేథ యాగం చేయతలపెట్టగా ఇంద్రుడు ఆ అశ్వాన్ని దొంగిలించి, కుయుక్తితో దానిని కపిల మాహర్షి దగ్గర కట్టి వేశాడు. ఆ దృశ్యాన్ని తిలకించిన యువ రాజులు కపిలుడే దానిని బంధించాడని భావించి, ఆయనను ఘాటుగా విమర్శించారు. అందుకు ఆగ్రహించిన ఆ ఋషి రాజకుమారులందరినీ భస్మంగా మారుస్తాడు.

సాగర చక్రవర్తి రెండవ భార్య కుమారుడు అసమంజ.అసమంజుని కొడుకు అంశుమానుడు..
పినతండ్రుల జాడ వెతుకుతూ అక్కడికి చేరుకుంటాడు. చుట్టూ బూడిదకుప్పలు. విషయం అర్థమైపోతుంది.అంసుమాన్‌ తమ తప్పును క్షమించి శాంతించమని ఆ ఋషిని వేడుకున్నాడు. దాంతో శాంతించిన రుషి... దేవలోకం నుండి గంగను భూమి మీదకు తేగలిగితే, రాకుమారుల ఆత్మలు శాంతిస్తాయన్నారు.. అరవైవేల పాపాల్ని ఒక్కదెబ్బతో కడిగేయగల శక్తి గంగకే ఉందని సలహా ఇస్తాడు గరుత్మంతుడు. సగరుడి తరం ముగుస్తుంది. అంశుమానుడి తరం ముగుస్తుంది. దిలీపుడి తరం ముగుస్తుంది. గంగను రప్పించడం ఎవరితరమూ కాదు. భగీరథుడి పాలన వెుదలవుతుంది. భగీరథ ప్రయత్నమూ వెుదలవుతుంది. అతని ఘోరతపస్సుకు మెచ్చి, బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. కానీ, గంగా ప్రవాహాన్ని తట్టుకునే శక్తి భూమికి లేదని స్పష్టంచేస్తాడు. మధ్యలో ఓ మజిలీ అవసరమవుతుంది. పరమశివుడికే ఆ సామర్థ్యం ఉందంటాడు. భగీరథుడు శివుడ్ని ప్రార్థిస్తాడు. గంగను నెత్తినెక్కించుకోడానికి ముక్కంటి ఒప్పుకుంటాడు..శివుడి జటాఝూటాల్లోంచి... గంగావతరణ వెుదలవుతుంది.

శివుడినెత్తిన ఉన్న సురగంగ...
హిమాలయాల్లోని బిందు సరస్సు ప్రాంతంలో భూమిని పాయలుగా తాకుతుంది. తూర్పువైపున... హ్లాదిని, పావని, నళిని. పశ్చిమం దిక్కున... సుచక్షు, సీత, సింధు. వెుత్తం ఆరుపాయలు. ఏడోపాయ మాత్రం భగీరథుడి రథం వెనకాలే పరిగెడుతుంది. దార్లోనే జహ్ను మహర్షి ఆశ్రమం.ఆ ప్రవాహానికి తాటాకు గుడిసెలన్నీ కొట్టుకుపోతాయి. మహర్షి ఆగ్రహోదగ్రుడవుతాడు. గంగను దోసిట్లో పట్టేసుకుని తీర్థంలా తాగేస్తాడు. ఆ బందిఖానా నుంచి విడుదలచేయమని అంతా వేడుకుంటారు. లోకకల్యాణార్థం మహర్షి సరేనంటాడు. చెవిలోంచి బయటికి వదిలేస్తాడు. ఎత్తుపల్లాల్ని దాటుతూ... ఎగుడుదిగుడుల్ని అధిగమిస్తూ... అపుడపుడూ ఉద్ధృతంగా... అక్కడక్కడా మందగమనంతో... ప్రవహించి ప్రవహించి భరతఖండాన్ని పావనం చేస్తుంది పుణ్యాల గంగ.

భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భగీరథి అయ్యింది. జహ్ను పొట్టలోంచి పుట్టి జాహ్నవిగా పరిచయమైంది. నింగి, నేల, పాతాళం-మూడులోకాలు. తూర్పు, పడమర, దక్షిణం-మూడు దిక్కులు. ముచ్చటగా మూడువైపులా పారి, 'త్రిపథగ' అన్న పేరునూ సార్థకం చేసుకుంది. ఆ ప్రవాహం పుణ్యమాని సగరులు ముక్తులయ్యారు. భూమి మురిసిపోయింది. దేవతలు పులకించారు. మానవులు పరవశించారు. జలచరాలు జయజయధ్వానాలు చేశాయి. పచ్చని
పంటలు ప్రాణంపోసుకున్నాయి. భూమి స్వర్గమైంది. ఆ వైభోగం ముందు, అసలు స్వర్గం చిన్నబోయింది. గంగ భూమికి దిగొచ్చినరోజే, మకర సంక్రాంతి!

క్రాంతి అంటే మార్పు. భరతజాతి చరిత్రలో గంగావతరణాన్ని మించిన, గొప్ప మార్పేముంది? వ్యవసాయిక దేశంలో జలవనరులు నిండుగా మెండుగా పొంగిపొర్లిన నాడే నిజమైన పండగ. అందుకే, పచ్చని పంటలిచ్చిన గంగమ్మ ప్రత్యక్ష దైవమైంది. ఆ ఒడ్డునే పుణ్యక్షేత్రాలు వెలిశాయి. నగరాలు పుట్టాయి. సామ్రాజ్యాలు ప్రాణంపోసుకున్నాయి. నాగరికత పరిఢవిల్లింది. దివిగంగ భువికి దిగివచ్చిన తీరు అద్భుతం. అదో అపురూప ఘట్టం. 'రఘువంశం'లో కాళిదాసు పదప్రవాహం గంగాఝరిని గుర్తుకుతెచ్చింది. ఉత్పలవారి 'గంగావతరణం' మాత్రం తక్కువా?

'హృషీకేశ హరిద్వార రుష్యాశ్రమ ముక్తేశ్వర పుణ్యపదములెల్ల దాటి పొంగులెత్తి వచ్చెగంగ!'
...ఆ పద్యపాదాల్లో గంగమ్మ అడుగుల సవ్వడి వినిపిస్తుంది. బాపురమణల 'సీతాకల్యాణం'... గంగావతరణను వెండితెర మీద హృద్యంగా ఆవిష్కరించింది. సినారె ఆ క్రతువుకు కలంసాయం అందించారు. రవివర్మ నుంచి వడ్డాదివారి దాకా... ఎంతోమంది చిత్రకారులు ఆ అద్భుత దృశ్యానికి రంగులద్దారు.

మహాబలిపురంలోని గంగావతరణ శిల్పం... రాతితో మలచిన రమణీయ కావ్యం. కెవిన్‌ పెర్ష్‌ అనే ఆస్ట్రేలియా చిత్రకారుడైతే... ఆరేళ్లు శ్రమించి, వెుత్తం 21 చిత్రాలలో గంగాప్రవాహాన్ని కాన్వాస్‌ మీద సృష్టించాడు. 'ఆ సౌందర్యాన్ని వర్ణించడానికి వేయి బొమ్మలైనా సరిపోవు. వంద రంగులున్నా చాలవు. నా ప్రయత్నం చంద్రుడికో నూలుపోగే' అని వినయంగా చెప్పుకున్నాడు కెవిన్‌.

ఆది గంగ...
గంగ పుట్టుక వెనుకా ఓ ఐతిహ్యం ఉంది. వామనుడు మూడడుగుల నేల అడిగాడు. బలి సవినయంగా సమర్పించుకున్నాడు. ఒక అడుగు భూమిని ఆక్రమించింది. రెండో అడుగు...ఇంతై ఇంతింతై బ్రహ్మలోకం దాకా విస్తరించింది. సాక్షాత్తు విష్ణుమూర్తి పాదం... గడపదాకా రావడమంటే, ఎంతదృష్టం! భక్తితో కాలు కడిగి, ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు బ్రహ్మ. ఆ తీర్థమే... సురగంగగా అవతరించింది. భగీరథుడి కృషితో భూలోకానికి వచ్చింది. భారతీయుల హృదయగంగై ప్రవహించింది. భూగోళశాస్త్ర పరంగా చూసినా... గంగ ఇప్పటిది కాదు. వేదకాలం నాటికే ప్రవహించింది. కానీ అప్పట్లో సింధు, సరస్వతి నదులకే ప్రాధాన్యం.
రుగ్వేద రుక్కులు ఆ రెండు నదుల్నే కీర్తించాయి. ఓచోట 'గంగ' ప్రస్తావన ఉన్నా, ఆ మాట నీటికి సంబంధించిందో, ఏటికి సంబంధించిందో స్పష్టంగా తెలియదు. రుగ్వేదానంతర కాలంలో గంగ ప్రాధాన్యం పెరిగింది. వేదర్షులు గంగానదిని 'జాహ్నవి' అని పిలిచారు. రామాయణం నాటికి గంగకు పూజనీయ స్థానం లభించింది.

రామావతారంలో తాను గంగానది ఒడ్డునే పుడతానని విష్ణువు దివిజగంగకు మాటిచ్చాడు. సీతారామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు గుహుడు దాటించింది గంగానదినే. ఇక భారతమైతే గంగ ప్రవేశంతోనే గొప్ప మలుపు తిరుగుతుంది. శంతన మహారాజు అద్భుత సౌందర్యరాశి అయిన గంగ మీద మనసుపడతాడు. వరాలిచ్చి మనువాడతాడు. ఆ జంటకు పుట్టిన బిడ్డే భీష్మపితామహుడు. మిగిలిన భారతమంతా మనకు తెలిసిందే. చరిత్రలో గంగ
ప్రాధాన్యం విస్మరించలేనిది. మహామహా రాజ్యాలన్నీ గంగ ఒడ్డునే వెలిశాయి. సారవంతమైన గంగ-యమున పరీవాహక ప్రాంతంపై ఆధిపత్యం కోసం అనేక యుద్ధాలు జరిగాయి.

జల సాక్షి...
నదీ తీరాల్లో నాగరికతలు పుట్టాయి. అంతరించాయి. రాజ్యాలు వెలిశాయి. మట్టికొట్టుకుపోయాయి. నదులు వర్తకవాణిజ్యాలకు కేంద్రాలయ్యాయి. పుణ్యక్షేత్రాలకు నిలయాలయ్యాయి. పాడిపంటలకు మూలమయ్యాయి. మనిషి మనుగడను మలుపుతిప్పిన నదీనదాలు చాలానే ఉన్నాయి. కానీ, అవన్నీ గంగానదులు కాలేకపోయాయి. భారతీయుల హృదయాల్లో గంగకున్న స్థానం వేరు. పుట్టుక నుంచి కట్టకడదాకా, ఆమాటకొస్తే మరణం తర్వాత కూడా... భారతీయుల జీవితాలు గంగతోనే ముడిపడ్డాయి. బిడ్డ పుట్టగానే గొంతులో ఓ చుక్క గంగతీర్థం పోయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం. బిడ్డకు చేయించే తొలి స్నానం గంగాజలంతోనే. 'గంగేచ, యమునేచైవ గోదావరీ సరస్వతీ...' అంటూ పెద్ద ముత్తయిదువలు గంగమ్మను గంగాళంలోకి ఆహ్వానిస్తారు. ఆ పిలుపు వినిపించగానే, సర్వనదుల ప్రతినిధిగా... సురగంగ బిరబిరా తరలివస్తుంది.
కార్డు మీద పిన్‌కోడ్‌ నంబరు వేయకపోతే, పోస్టుమాస్టరుగారికి చిర్రెత్తుకొస్తుంది. సరైన చిరునామాలో అందించడానికి ఆ అంకెలు చాలా అవసరం.
సృష్టిమాస్టారుగారి పిన్‌కోడ్‌... గంగ! గంగా పరీవాహక ప్రాంత ప్రజలు సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు... తాము గంగకు ఏ దిక్కున ఉన్నారో పరమాత్మకు విన్నవించుకోవాలి. లేదంటే, ఆ వెుర దేవరకు చేరదు. భారతీయులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా మునిగితీరాలనుకునే జలక్షేత్రాల్లో గంగానది ఒకటి. ఆ స్పర్శతో సకలపాపాలూ హరించుకుపోతాయన్న నమ్మకం. అందుకే పితృదేవతలు పైలోకాల్లోంచి మనం గంగలో ఎప్పుడు మునకలేస్తామా అని ఎదురుచూస్తుంటారట. జీవిత చరమాంకంలో, మృత్యుఘడియ దగ్గరపడుతున్నప్పుడు... శ్వాస సహకరించకున్నా, గొంతు పెగలకున్నా, మాట
తడబడుతున్నా ఎక్కడలేని శక్తిని కూడదీసుకుని 'గంగ...' పోయమని అర్థిస్తాడు జీవుడు. తులసి కలిసిన ఆ పవిత్ర తీర్థాన్ని సేవిస్తే నేరుగా పుణ్యలోకాలకు చేరుకుంటామన్న నమ్మకం.

మహాభారతంలో... అంపశయ్య మీది నుంచే భీష్ముడు గంగా మహత్తును వివరిస్తాడు. ఒక్క గంగాస్నానంతో... యజ్ఞయాగాదులు చేసినంత పుణ్యం, పూజలూ వ్రతాలూ చేసినంత ఆధ్యాత్మిక సంపత్తి. గంగ తగిలితే చాలు... అటు ఏడు తరాలూ ఇటు ఏడు తరాలూ పవిత్రమైపోతాయట. గంగ లేని దేశం... సోమం లేని యజ్ఞమట! చంద్రుడు లేని రాత్రిలాంటిదట. పూలు పూయని చెట్టులాంటిదట. 'ఇన్ని మాటలెందుకు కానీ, గంగ గొప్పదనం చెబుతూ పోతే, సముద్రంలో నీటి కణాల్ని లెక్కపెట్టినట్టే ఉంటుంది' అంటాడు భీష్మపితామహుడు! గంగ మహత్యానికి కొన్ని శాస్త్రీయమైన కారణాలూ ఉన్నాయి. ఆ నీటికి కఫాన్ని తగ్గించే గుణం ఉంది. అందుకేనేవో, తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నవారి గొంతులో చిటికెడు గంగ పోస్తారు.
గంగానదిలోని కొన్నిరకాల సూక్ష్మక్రిములకు వివిధ వ్యాధుల దుష్ప్రభావాన్ని తగ్గించే గుణం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. గంగోత్రి నుంచి బయలుదేరి ఎన్నో అరుదైన వెుక్కల్నీ వనమూలికల్నీ తనలో కలుపుకుని ప్రవహించే గంగానదికి ఔషధీయ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అన్నిటికీ మించి, గంగ మీదున్న నమ్మకం, అచంచలమైన భక్తి..ఆ నీటికి అంత మహత్తునిచ్చింది.

జ్ఞానవాహిని..
గంగ... జ్ఞానగంగ! ఆ గాలి ప్రభావంతో, ఆ తీర్థ మహత్యంతో... ఎన్నో జీవితాలు మారాయి. చికట్లు తొలగిపోయాయి. అజ్ఞానం పటాపంచలైంది. అహం మంచులా కరిగిపోయింది. ఓరోజు శంకర భగవత్పాదులవారు గంగానదిలో స్నానానికి వెళ్తున్నారు. నాలుగు శునకాలతో చండాలుడు ఎదురొచ్చాడు. 'స్వామివారొస్తున్నారు. పక్కకు తప్పుకో' అని హెచ్చరించారు శిష్యులు. 'పక్కకు జరగమంది ఈ శరీరాన్నా? శరీరంలోని ఆత్మనా? అప్పుడది ద్వైతమే కానీ, అద్వైతం కాదే' అని వాదిస్తాడు చండాలుడు. కాదుకాదు, చండాలుని రూపంలోని పరమశివుడు. గంగమ్మ సాక్షిగా శంకరుడికి జ్ఞానబోధ అవుతుంది. కర్తవ్యోపదేశం జరుగుతుంది. గంగ మనసు వెన్న. పిలిస్తే పలుకుతుంది. అర్థిస్తే కరుణిస్తుంది. తెలుగు కవి పండితరాయలే ఆ మంచితనానికి ప్రత్యక్ష సాక్షి. 'గంగాలహరి' రాసిన పరమభక్తుడాయన. చివరి రోజుల్లో గంగలో ఐక్యం కావాలనుకున్నాడు. ఒడ్డున నిలబడి 'గంగాలహరి' పాడుతుంటే...ఒక్కో శ్లోకం పూర్తవుతుంటే, ఒక్కో అడుగూ ముందుకొచ్చి... ఆ కవిరాయలను తనలో కలిపేసుకుంది గంగ. ఇప్పటికీ, గంగానదికి పండితరాయల శ్లోకాలతోనే హారతులిస్తారు. ఇది, తెలుగువారికి గంగమ్మ మీదున్న భక్తికి నిదర్శనం. గంగమ్మకు తెలుగువారి మీదున్న ప్రేమకు తార్కాణం. ముక్తినిచ్చే తల్లి భుక్తిని మాత్రం ఇవ్వకుండా ఉంటుందా? గంగ, దాని ఉపనదుల పుణ్యమాని పరీవాహక ప్రాంతమంతా పచ్చదనమే. వరి, మిరప, చెరకు, జనపనార... తదితర పంటలు పుష్కలంగా పండుతాయి. పర్యాటకులతో పుణ్యక్షేత్రాలతో కళకళలాడే ఆ నదీతీరాలు... ఎంతోమందికి ఉపాధినిస్తున్నాయి. ఎన్నో పరిశ్రమలకు గంగనీరే దిక్కు. గంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఎక్కడో దేవలోకంలో పుట్టిన గంగ నలుగురి కోసం నేలకు దిగింది. పంటలకు నీరిచ్చింది. మనుషులకు పంటలిచ్చింది. జలచరాలకు ప్రాణమిచ్చింది. ఎంత మంచితనం, ఎంత త్యాగగుణం!

పరిస్థితులను బట్టి సర్దుకుపోవడం ఎలాగో గంగను చూసే నేర్చుకోవాలి. ఉద్ధృత గంగా ప్రవాహం... అవసరాన్ని బట్టి అక్కడక్కడా మందగిస్తుంది. పరిస్థితులకు తలవొగ్గి, నిశ్శబ్దంగా ముందుకెళ్తుంది. నదీప్రవాహంలోనే కాదు, జీవన ప్రవాహంలోనూ పట్టువిడుపులుండాలన్న గొప్పపాఠమది. గంగ స్నేహానికి ప్రాణమిస్తుంది. ఎలాంటి ప్రాశస్త్యమూ లేని మామూలు వాగుల్నీ వంకల్నీ చిన్నాచితకా నదుల్నీ ప్రేమగా తనలో కలిపేసుకుంది. వాటికి పవిత్రతను కల్పించింది.
సజ్జన సాంగత్యంలోని గొప్పతనమే అది. ఇక యమునకైతే అర్ధ సింహాసనాన్నిచ్చి గౌరవించింది. రెండు మతాలు, రెండు ప్రాంతాలు, రెండు జాతులు, ఇద్దరు వ్యక్తులు... ఒక్కటిగా ఉండాలని చెప్పిన ప్రతిసారీ గంగాయమునల సంగమాన్నే గుర్తుచేసుకుంటాం. నిజానికి గంగ కంటే, యమున భౌతికంగా శక్తిమంతమైంది. ఉద్ధృతమైంది. కానీ గంగకున్న ఆధ్యాత్మికశక్తి ముందు, త్యాగమయమైన చరిత్రముందు యమున సవినయంగా తలవంచింది. అందుకే అది 'యమునాగంగ' సంగమం కాలేదు. 'గంగాయమున' సంగమమే అయ్యింది.

రామ్‌ తేరీ గంగా మైలీ...
మనిషి భస్మాసుర అంశ. లేకపోతే, వరాలతల్లికే ఉరిబిగిస్తాడా? దిగివచ్చిన దేవతనే అవమానిస్తాడా? వెర్రులెత్తిన స్వార్థంతో గంగనే మింగేస్తాడా? వ్యర్థాల్నీ రసాయనాల్నీ కాష్ఠాల్నీ కాలుష్యాల్నీ భరించలేక జాహ్నవి బేజారెత్తిపోయింది. పరిశ్రమల వ్యర్థాల కారణంగా ఎప్పటి నుంచో గంగమ్మనే నమ్ముకున్న వేలవేల జలచరజాతులు కనుమరుగు అవుతున్నాయి. పెళ్లీపేరంటాల్లో పట్టుపావడాలతో గెంతులేసే అమ్మాయిల్లా... గంగానదిలో సందడిచేసే డాల్ఫిన్లు...మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి. కబ్జాలూ ఆక్రమణలూ ప్రవాహ గతినే మార్చేస్తున్నాయి. హద్దులు దాటిన భక్తి భక్తే కాదు. అది మూఢత్వం. వేలకొద్దీ దహనాలతో అమృతగంగ మృతకళేబరాలకు నిలయమైపోయింది. గంగలో కలుపుతున్న పూలూ అస్తికలూ బూడిదలూ... జీవరాశినిబలిగొంటున్నాయి.

మరింత కాలుష్యాన్ని పోగుచేస్తున్నాయి. ఇది చాలదన్నట్టు...ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు. ఒకప్పుడు, సకలరోగాల నుంచి విముక్తి కలిగించిన ఔషధ గంగ... ఇప్పుడు, సర్వరోగాలకూ కారణం అవుతోంది. ఈ దుస్థితిని చూడలేక, ఆ దుర్వాసన భరించలేక నదీమతల్లిని దేవతగా ఆరాధించే భక్తుల కళ్లలో గంగ పొంగుకొస్తోంది. ఇంకో పుష్కరం వస్తోందంటే, ఇంకెంత చెత్త పోగవుతుందో అని భయపడాల్సిన పరిస్థితి.

భాగీరథీ సుఖదాయినీ మాతా
తవ జల మహిమా నిగమే ఖ్యాతా
నాహం జానే తవ మహిమా
పాహి కృపామయీ మమాజ్ఞానమ్‌
'గంగమ్మా! వరాలిచ్చే చల్లని తల్లీ!

నీ పవిత్రతను వేదాలు కీర్తించాయి. ప్రపంచమంతా కొనియాడింది. కానీ అవేవీ తెలియని అజ్ఞానులం మేం. నిన్ను కాలుష్యకాసారంగా మార్చినందుకు క్షమించు' అని లెంపలేసుకోడానికి పుష్కరమే సరైన సమయం. పశ్చాత్తాపం మనసులోని మాలిన్యాల్ని కడిగేస్తుంది. గంగాజలాల శుద్ధికి కూడా అదే సత్సంకల్పం.

గంగ...శుభ్రంగా!
వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ ప్రకారం...ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యానికి గురైన పది నదుల్లో గంగ ఒకటి. దాదాపు 30 నగరాల మురుగు, 25 పట్ణణాల కాలుష్యం, వేలకొద్దీ గ్రామాల వ్యర్థాలు... అంతా కలిసి దాదాపు మూడువేల మిలియన్‌ లీటర్ల చెత్తాచెదారం గంగలో కలుస్తోంది. గంగానదిలోంచి కాలుష్యాన్ని తరిమేయడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలే చేశాయి. న్యాయస్థానాలు కూడా బాగానే వెుట్టికాయలు వేశాయి. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 'గంగా యాక్షన్‌ ప్లాన్‌' కింద నదీజలాల శుద్ధికి దాదాపు వేయి కోట్లు ఖర్చుచేశారు. అయినా ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. తాజాగా పర్యావరణ మంత్రిత్వశాఖ 43 ప్రాజెక్టుల కింద రూ.2,400 కోట్లు మంజూరు చేసింది. ఈ వెుత్తంతో గంగానది అధికంగా కాలుష్యానికి గురవుతున్న ప్రాంతాల్లో ... నీటిశుద్ధి ప్లాంట్లు, మురుగునీటి కాలువలు తదితర సౌకర్యాలు కల్పిస్తారు. 2020 నాటికంతా గంగానదిని స్వచ్ఛంగా తయారుచేయాలన్నది జాతీయ గంగా పరీవాహక సంస్థ ఆశయం. దీనికి సాక్షాత్తు ప్రధానమంత్రే నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి కూడా భారీవెుత్తంలో సాయం అందబోతోంది. ఎలాగైనా సరే, గంగను రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఏడు ఐఐటీలకు చెందిన నిపుణులతో ఓ బృందం ఏర్పాటైంది. ఏ కార్యక్రమ విజయానికైనా నిధులొక్కటే ప్రధానం కాదు... ప్రజా భాగస్వామ్యం ఉండాలి. పాలకుల చిత్తశుద్ధి ముఖ్యం. గంగ విషయంలో ఈ రెండే కరవవుతున్నాయి.

గంగా ప్రవాహం.

గంగోత్రి హిమనీనదంలో పుట్టిన భగీరథి దేవ ప్రయాగ దగ్గర అలకనందతో సంగమించి... 'గంగ' అవుతుంది. హరిద్వార్‌ దగ్గరికొచ్చి... జనగంగ అవుతుంది. కోసి, గోమతి, శోణ తదితర నదులు ప్రవాహ మార్గంలో కలుస్తాయి. అలహాబాద్‌ దగ్గర యమున తోడవుతుంది. ఆ తర్వాత ఎన్నో చిన్నాపెద్దా నదులు గంగలో కలిసి ఉద్ధృతిని పెంచుతాయి. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా దగ్గర గంగ వెుదటిసారి చిలుతుంది. అక్కడి నుంచే గంగానది చిలిక... హుగ్లీనది వెుదలవుతుంది. ప్రధాన గంగను... మాల్దా తర్వాత పద్మానది అంటారు. బంగ్లాదేశ్‌లో ప్రవేశించాక, బ్రహ్మపుత్ర చిలిక అయిన జమునానది ఇందులో కలుస్తుంది. ఆతర్వాత మేఘన జతవుతుంది. ఆతర్వాత ఎన్నో చిలికలుగా ప్రవహించి... బంగాళాఖాతంలో కలుస్తుంది.

గంగా నది పుష్కర వైభవం

పన్నెండేళ్లకోసారి వచ్చే పెద్దపండగకు గంగానది సిద్ధమవుతోంది. ఆ పన్నెండురోజులూ గంగోత్రి, గంగాసాగర్‌, హరిద్వార్‌, బదిరీనాథ్‌, కేదారనాథ్‌, వారణాసి, అలహాబాద్‌ క్షేత్రాలు పుష్కరశోభతో కళకళలాడతాయి. అసలు పుష్కరాలెందుకు? వాటి ప్రాశస్త్యం ఏమిటి? ... అదంతా ఓ పెద్ద కథ. పూర్వం పుష్కరుడనే బ్రాహ్మణుడు శివుడి కోసం తపస్సు చేశాడు. భక్తవశంకరుడు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు. పుష్కరుడు మణులో మాణిక్యాలో అడగలేదు. రాజ్యాలూ సామ్రాజ్యాలూ ఆశించలేదు. జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమైపోతున్నాయి. నదులు పునీతమైతే దేశమూ సుభిక్షంగా ఉంటుందని ఆ సత్పురుషుని ఆలోచన. అందుకే, 'దేవా... నా శరీర స్పర్శతో సర్వం పునీతం అయ్యేట్టు వరమివ్వు' అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు 'నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థమవుతుంది. ఆ నదిలో స్నానమాచరించిన వారు పాపవిముక్తులవుతారు. జన్మరాహిత్యాన్ని పొందుతారు' అని వరమిచ్చాడు. పుష్కరుడు సంతోషించాడు. పుష్కర మహత్యం తెలుసుకున్న గురుడు(బృహస్పతి) తనకూ పుష్కరత్వాన్ని ప్రసాదించమని బ్రహ్మను అడిగాడు. అందుకు పుష్కరుడు అడ్డుచెప్పాడు. ఇద్దరికీ నచ్చజెప్పి సమాన ప్రాతినిధ్యం కల్పించాడు బ్రహ్మ. బృహస్పతి ఏడాదికి ఒక్కో రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. ఆ మేరకు, బృహస్పతి ఆయా రాశుల్లో చేరిన తొలి పన్నెండు రోజులనూ ఆది పుష్కరాలుగా, చివరి పన్నెండు రోజులనూ అంత్య పుష్కరాలుగా వేడుకలు నిర్వహిస్తారు.

గురుడు మేషరాశిలో ప్రవేశించడంతో, గంగ పుష్కరాలు వెుదలవుతాయి. ఆ ప్రకారం మే 8 నుంచి 19 దాకా... గంగకు పుష్కర మహత్తు వస్తుంది. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారు. ఆ నీటిలో స్నానంచేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయనీ అక్కడ పిండప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారనీ పురాణాలు చెబుతున్నాయి.

ప్రతి మనిషి ఒంట్లో ఉండే మూడొంతుల నీరు గంగే. ఉద్వేగం పెల్లుబికినప్పుడు, జలజలా కారే కన్నీరు గంగే. కాయకష్టం చేసినప్పుడు, బొటబొటా రాలే చమటబిందువు గంగే! పూజారి చేతి పవిత్ర తీర్థం గంగ. ఆకాశంలోంచి కురిసే చిన్ని చినుకు గంగ. పాతాళంలోంచి పొంగే జలధార గంగ. గంగ... వేదాల్లో ఉంది. ఉపనిషత్తుల్లో ఉంది. రామాయణంలో ఉంది. భారతంలో ఉంది. భాగవతంలో ఉంది. భగవద్గీతలో ఉంది. అనగనగా కథల్లో ఉంది. జానపద గాథల్లో ఉంది. పల్లెపాటల్లో ఉంది. పామరుల నమ్మకాల్లో ఉంది. అయినా, గంగ లేనిదెక్కడ? పుట్టింది హిమాలయాల్లో అయినా, మెట్టింది బికారి శివయ్యనే అయినా... గంగ సమస్త భారతీయుల హృదయగంగ. గంగ అంతర్వాహిని. గంగ అనంతవాహిని.

రోజుకు పాతిక లక్షల మంది గంగలో మునుగుతారు. రోజుకు కోటిమంది పూజలోనో, వ్రతంలోనో, యజ్ఞంలోనో, పితృకార్యంలోనో గంగను తలుచుకుంటారు. 'డిస్కవరీ ఆఫ్‌ ఇండియా'లో నెహ్రూ ఎంతగొప్ప మాటన్నారు... 'గంగ పుట్టింది వెుదలు సముద్రంలో కలిసేదాకా... ప్రతి అడుగూ భారతీయులకు పవిత్రమే. ఆ ఒడ్డున ఎన్ని నాగరికతలు పుట్టాయి! ఎన్ని సామ్రాజ్యాలు వెలిశాయి! ఎన్నెన్ని మట్టి కొట్టుకుపోయాయి! మానవ వికాస చరిత్రకు గంగా ప్రవాహమే సాక్ష్యం'. గంగచుట్టూ అల్లుకున్న కథలూ గాథలూ ఐతిహ్యాలూ పురాణ ప్రాశస్త్యాలూ... నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ, ప్రతి కథా గంగ మీదున్న గంపెడు ప్రేమకు సాక్ష్యమే. ప్రతి ఐతిహ్యం ఆ తల్లికి పట్టే మంగళ హారతే.
Share:

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com