..

  • This is featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

  • This is featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

  • This is featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

Monday 10 October 2016

నవదుర్గా అలంకారములు : శ్రీశైలం.

11.పదకొండవరోజు అమ్మవారి అలంకారం : శ్రీ భ్రమరాంబికా దేవి. (నిజాలంకారం)

శివపార్శ్వస్థితా మాతా | శ్రీశైలే శుభపీఠికే ||
భ్రమరాంబా మహాదేవీ | కరుణారసవీక్షణా ||

ఒకానొకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. బుద్ధి ఎలా ఉంటుందంటే సృష్టికర్తయైన బ్రహ్మగారిని మేము మోహపెట్టగలము అనుకుంటారు. ఆయనచే తప్పటడుగు వేయించాము అని సంతోషపడిపోతూ వుంటారు. ఆయన బ్రహ్మగారి గురించి ఉగ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి? అని అడిగాడు. అస్త్రశస్త్రములచేత నేను మరణించకూడదు అని కోరుకున్నాడు. తథాస్తు అన్నారు బ్రహ్మగారు. వెంటనే స్వర్గలోకానికి వెళ్ళి దేవతలందరినీ తరిమేశాడు. గోవులను సంహారం చేసేశాడు. బ్రాహ్మణులెవ్వరూ వేదం చదవకూడదని, తనకే హవిస్సులివ్వాలని అన్నాడు. దేవాలయాలన్నింటా నావే మూర్తులు అన్నాడు. ధర్మచక్రం తిరగడంలో అవ్యవస్థ ఏర్పడకూడదు. దేవతలు మర్త్య లోకాన్ని అనుగ్రహించాలి. అలా జరగాలంటే మనము ఒక యజ్ఞమో యాగమో చేసి దేవతలకు హవిస్సు ఇవ్వాలి. అది తీసుకొని వారు అనుగ్రహించి ప్రత్యుపకారంగా వర్షం కురిపిస్తారు. దానివల్ల మనకు పాడి, పంట అన్నీ బాగుంటాయి. ధర్మ చక్రం తిరగడంలో వైక్లవ్యం రాక్షసుల వల్ల వస్తుంది. రాక్షసుడు దేవతలకు హవిస్సు లేకుండా చేసి ఈ ధర్మచక్రం తిరగడాన్ని ఆపాడు. దేవతలందరూ బ్రహ్మగారి వద్దకు వెళ్ళారు. బ్రహ్మగారు అన్నారు - "ఇది నావల్ల అయ్యే పని కాదు. అస్త్రశస్త్ర ప్రయోగము లేకుండా చంపాలంటే, మిమ్మల్ని అనుగ్రహించాలంటే హిమాలయాలకు వెళ్ళి కన్నతల్లి, కరుణామయి జగదంబను ప్రార్థన చేయండి" అని చెప్పారు. అది తపోభూమి. అక్కడ నిలబడి ప్రార్థన చేస్తే ఉత్తరక్షణం ఫలిస్తుంది. వాళ్ళందరూ అక్కడ చేరి ప్రార్థన చేశారు. జగదంబ వాణి వినపడింది - "మీ ఆర్తి నాకు తెలుసు. వాడిని ఎలా చంపాలో నాకు తెలుసు" అని. ఇద్దరిమధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. దేవతలందరూ అమ్మవారి వైపు నిలబడ్డారు. ఎన్ని అస్త్రాలు, శస్త్రాలు వేసినా వాడు మరణించలేదు. అప్పుడు అమ్మవారు భ్రమర రూపాన్ని పొందింది. దేవతలందరూ కూడా భ్రమరాలుగా మారారు. భ్రమరీ రూపంతో వెళ్ళి కాళ్ళతో, తొండంతో, హృదయాన్ని ఛేదించి ఆయువుపట్లని త్రుంచేసింది. దానితో అరుణాసురుడు మరణించాడు. దానితో దేవతలు పరవశించి స్తోత్రం చేశారు. అమ్మవారు అరుణాసుర సంహారం చేసేశాను. మీరు ఇక వెళ్ళి క్షేమంగా ఉండండి అన్నది. దేవతలు అమ్మా! నువ్వు ఒక ఉపకారం చేయాలి. నువ్వు వెళ్ళిపోకూడదు భూమిమీదనుంచి. అవతారానికి ప్రయోజనం అయిపోయిందని వెళ్ళిపోతే మేము మళ్ళీ మిమ్మల్ని కావాలనుకున్నప్పుడు చూసి ప్రార్థన చేయడానికి, పూజ చేసుకోవడానికి సామాన్యుడికి అందవు. అందుకని ఈ భూమండలంమీద ఎక్కడ ఉందామని నువ్వు అనుకుంటున్నావో అక్కడికి వచ్చి వెలసి ఉండవలసినది. అని కోరారు. భ్రమరాంబా దేవికి ఒక లక్షణం ఉంది. అజ్ఞానం అనే తెర ఎత్తడం దగ్గరనుంచి యే పనైనా జటిలమైపోయి జరగనప్పుడు జరిపించగలిగిన శక్తిగా మారి అనుగ్రహిస్తుంది. పరమశివుడు మల్లికార్జున అన్న పేరుతో జ్యోతిర్లింగంగా ఎక్కడ వెలిశాడో అక్కడికి వచ్చి ఈ భ్రామరీ రూప అలంకారాన్ని పొందుతాను. రాక్షససంహారం చేసి ఉపకారం చేశానన్నది నిజమూర్తిగా ఉంటుంది. కానీ పరమశివుని విడిచి ఉండలేని దాన్ని కాబట్టి అర్థనారీశ్వర మూర్తిగా వెలిసి ఉంటానని చెప్పింది. అందుకు మూడు రూపాలతో ఉన్నది. 

ఇప్పటికీ మల్లికార్జున దేవాలయం ప్రక్కకి వెళితే ఉత్తరం వైపుకు వెళితే తూర్పుగా చూస్తూ అర్థనారీశ్వర దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో శివుియొక్క వామార్థ భాగంలో చేరింది భ్రమరాంబా దేవి. నిజమూర్తిని చూడలేము. ఒక్క అర్చకుడు మాత్రమే చూస్తాడు. శక్తి క్షేత్రాలలో 365 రోజులు అభిషేకం చేస్తారు. అలంకారం చేసి తలుపు తీస్తారు. అలంకారం చేస్తే భ్రమర రూపాన్ని పొందుతుంది. భ్రమరాంబా రూపంలో ఉన్న గొప్పతనం యేమిటంటే బొట్టు స్ఫుటంగా కనపడుతుంది. అసల మూర్తిని ఒకే ఒక్కచోట చూడవచ్చు - అది భ్రమరాంబ దేవాలయానికి ఉన్న గడప మీద ఒక చిన్న గాజుపేటిక ఉంటుంది. అందులో ఉంటుంది. అన్నింటికన్నా ఆశ్చర్యం యేమిటంటే దేవాలయానికి తాళం వేసినా అమ్మవారి వెనక గండుతుమ్మెదల బృందాలు ఎన్నో ఉంటాయిట. అందుకే భ్రామరీనాదం వినపడుతుంది. భ్రమరాంబ దేవాలయం వెనక్కి వెళితే గాడి ఉంటుంది. ఆ గాడి దగ్గర చెవి పెట్టి వింటే భ్రామరీనాదం వస్తుంది. దానిని ఆకాశవాణి విజయవాడ, కడప కేంద్రాలు రికార్డు చేసి ప్రసారంచేశాయి. భ్రమరాంబ దేవాలయం మీద ఉన్న శిల్పకళ చూడడానికి ఒకరోజు సరిపోదు. లోపల చూస్తే సంగ్రామ సన్నివేశాల దగ్గరినుంచి నర్తకీమణుల వరకు ఉంటాయి. అక్కడ గోడలమీద సింహాలుంటాయి. వాటి నోటిలో బంతులు లాంటివి ఉంటాయి .అవి త్రిప్పితే తిరుగుతాయి. అవి మళ్ళీ మనకి కంచి మణిమంటపంలో కనపడతాయి.

ఈరోజు మంగళవారం రాత్రి స్వామి,అమ్మవారికి అదికారిక "నందివాహన" సేవ జరుగుతుంది.
Share:

Sunday 9 October 2016

నవదుర్గా అలంకారములు : శ్రీశైలం.

పదవరోజున అమ్మవారి అలంకారం : శ్రీ రాజరాజేశ్వరీదేవి

అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా
గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా

ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి

శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరీ దేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత. "ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం" అనే మంత్రం జపించాలి. లలితా సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి. లడ్డూలు నివేదన ఇవ్వాలి. సువాసినీ పూజ చేయాలి. అవకాశం ఉంటే శ్రీ చక్రార్చన చేస్తే మంచిది.

ఈరోజు సోమవారం రాత్రి శ్రీశైలంలో స్వామి,అమ్మవారికి "అశ్వవాహన" సేవ జరుగుతుంది

Saturday 8 October 2016

శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి.

తొమ్మిదవరోజు అమ్మవారి అలంకారం : శ్రీ కనకదుర్గా దేవి.

విద్యుద్దామ సమప్రభాం 
మృగపతి స్కందస్థితాం భీషణా౦

కన్యాభి: కరవాలఖేల
విలద్దస్తా భిరాసేవితాం!

హసైశ్చక్రగదాసిఖేట 
విసిఖాంశ్చాపం గుణం తర్జనీం

బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం 
దుర్గం త్రినేత్రం భజే

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రుల్లో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవులను ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. అమ్మ నామాన్ని జపిస్తే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి. ఆరాధకులకు దుర్గాదేవి శీఘ్ర అనుగ్రహకారిణి. ఎర్రని బట్టలు పెట్టి ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణ చేయాలి. "ఓం దుం దుర్గాయైనమ:" అనే మంత్రం పఠించాలి. చక్రపొంగలి నివేదన చెయ్యాలి. దుర్గా, లలితా అష్టోత్తరాలు పఠించాలి.
నైవేద్యం - చక్రపొంగలి

9.తొంమ్మిదవరోజు అమ్మవారి అలంకారం : శ్రీ సిద్ధిదాత్రి దేవి.

'సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ

తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిధాత్రి సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది. ఈమె కరుణవల్లే పరమేశ్వరుని అర్ధశరీర భాగాన్ని పార్వతీ దేవి సాధించినట్టు పురాణకథనం. ఈమెకి ప్రార్ధన చేస్తే పరమానంద దాయకమైన అమృతపథం సంప్రాప్తిస్తుంది.
దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’. ఈమె సర్వవిధ సిద్ధులనూ ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో 1) అణిమ, 2) మహిమ, 3) గరిమ, 4) లఘిమ, 5) ప్రాప్తి, 6) ప్రాకామ్యము, 7) ఈశిత్వము, 8) వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా పేర్కొన బడ్డాయి. బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి. అవి…

1) అణీమ, 2) లఘీమ, 3) ప్రాప్తి, 4) ప్రాకామ్యము, 5) మహిమ, 6) ఈశిత్వ వశిత్వాలు, 7) సర్వకామావసాయిత, 8) సర్వజ్ఞత్వం, 9) దూరశ్రవణం, 10) పరకాయ ప్రవేశం, 11) వాక్‍సిద్ధి, 12) కల్పవృక్షత్వం, 13) సృష్టి, 14) సంహారకరణ సామర్థ్యం, 15) అమరత్వం, 16) సర్వన్యాయకత్వం, 17) భావన మరియు 18) సిద్ధి.

సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది. ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.

నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవరోజున ఉపాసించబడే దేవీ స్వరూపం ఈమెదే. తొమ్మిదవరోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల సిద్ధులూ కరతలామలకం అవుతాయి. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ లేదు. ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుంది.

ఈ సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులవ్వడానికి నిరంతరం ప్రతీ వ్యక్తీ ప్రయత్నించాలి. ఈ మాత దయా ప్రభావంవల్ల అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడవ్వగలడు. అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు.

నవదుర్గల్లో ‘సిద్ధిదాత్రి’ అవతారం చివరిది. మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంగా నిష్ఠతో ఆరాధించి, తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి. ఈ దేవిని ఉపాసించడం ముగియగానే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారలౌకిక మనోరథాలన్నీ సఫలమవుతాయి. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తుడికి కోరికలేవీ మిగిలి ఉండవు. ఇలాంటి భక్తుడు అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడు. ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదు.

దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పథం మనకు ప్రాప్తిస్తుంది.

ఈరోజు రాత్రి శ్రీశైలంలో స్వామి,అమ్మవారికి "హంసవాహన సేవ" జరుగుతుంది.

అమరావతి.. అమరలింగేశ్వర స్వామి

AP కొత్త రాజధాని కి అతి సమీపం లో , గుంటూరు నుండి 27 కి. మీ వున్న, విజయవాడ, గుంటూర్, మంగళగిరి , నుండి, అమరావతికి ప్రతి అరగంటకు బస్సులు తిరుగుతూవుంటాయి.
ఇక్కడ ఒకనాడు బౌద్ధులు విశ్వవిద్యాలయాలు స్థాపించి, మహొన్నతమైన చరిత్ర సృష్టించారు. విశ్వవిఖ్యాతిని వెలయించారు. ఆనాటి వైభవాలు చిహ్నాలు చరిత్రలో ఈ నాటికి సాక్ష్యం పలుకుతున్నాయి.
పంచారామాలయిన , అమరారామము, కొమరారామము, భీమారామము, ద్రాక్షారామము, క్షీరారామములలో మొదటిది.
పావన కృష్ణా నదీ తీరమున నెలకొనియున్న ఈ క్షేత్రము క్రీస్తు పూర్వ కాలమునుండి సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రముగా పేరుగాంచి యున్నది. ఇక్కడి ప్రాచీన బౌద్ధ స్థూపములు, శిల్పములు లెక్కకు మిక్కుటంగా వుండి పూర్వపు ఔన్నత్యమును చాటుతూ శిల్ప కళా విశేషములను ప్రస్ఫుటిస్తుంది. ఇది శాతవాహనుల కాలం నాటి వరకూ ఒక గొప్ప రాజధాని నగరంగా అభివృద్ధి చెందిన చిహ్నాలు కనబడుతున్నాయి.
🌿క్షేత్ర వైభవం:
ఇక్కడ ముఖ్యంగా చూడదగినది అమరేశ్వరాలయము. వెలసిన దేవుడు అమరేశ్వరస్వామి. దేవేరి రాజ్యలక్ష్మి అమ్మవారు. పంచ ప్రాకారాలు మధ్య ఆలయం ఎత్తుగ నిర్మించబడింది. ఇక్కడ లింగము సుమారు 15 అడుగులు ఎత్తున వుంటుంది. 3 అడుగుల కై వారంతో తెల్లగా వుంటుంది.
ఈ లింగమును గూర్చి ఒక వింత ప్రచారంలో ఉంది. ఈ శివలింగము దినదినము పెరుగుతూందనిన్నీ, ఆలయం ఎంత పెంచినప్పటికీ చాలక పోవటంతో ఆలయ నిర్మాతలు లింగము పెరగకుండా నివారించాలనే ఉద్దేశ్యంతో లింగము నెత్తి పై ఒక మేకుని కొట్టారని - అంతటితో పెరుగుదల ఆగిందని సమాచారం. దీన్ని ఋజువు పరస్తున్నట్లుగా - లింగం చాలా ఎత్తుగా ఉండి నెత్తి పైన మేకు - మేకు కొట్టినపుడు స్రవించిన రుధిర ధారల చారలు - గుర్తులున్నాయి. స్వామికి అభిషేకము చేయాలన్నా పైకెక్కి వెళ్ళి చేయాల్సివుంది.
ఈ అమరావతికి ఒక పురాణ కథ కూడా వుంది. దేవేంద్రుడు అహల్యా జారుడై తత్పాప పరిహారార్ధం ఇక్కడ శివలింగమును ప్రతిష్ఠించాడని దేవతల ప్రభువైన సురేంద్రుని చేత ప్రతిష్టించబడినది గాబట్టి ' అమరావతి ' నామము సార్ధకంగా ప్రసిద్ధమయినది అని అంటారు.
ఇక్కడ దగ్గరిలోనే దీపాల తిన్నె అనే ప్రదేశం వుంది. బౌద్ధ విగ్రహాలు, స్థూపాలు గలిగిన చోటు. ఇది ఆర్కిలాజికల్ డిపార్టుమెంటు వారు ఆనాటి ఔన్నత్యపు చిహ్నాలను తమ అధీనంలో వుంచుకుని ప్రాచీన కళా సంపదను కాపాడుతూ ఉన్నారు. చరిత్ర అధ్యయన పరులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయి.
శ్రీకృష్ణదేవరాయలు అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెదమద్దూరు గ్రామ పంటభూముల్ని ఆలయానికి దానమిచ్చినట్టుగా ఇక్కడ ఉన్న రాజశాసనం తేటతెల్లం చేస్తోంది.
కొండవీటి రెడ్డిరాజులపై విజయానంతరం 1517లో చారిత్రక ప్రాంతం కృష్ణాతీరమైన అమరావతిని దర్శించిన కృష్ణదేవరాయలు ఇక్కడ తులాభారం తూగారు. తన బరువుతో సరిసమానమైన బంగారాన్ని పేదలకు పంచిపెట్టినట్టుగా శాసనంలో ఉంది. అందుకు గుర్తుగా రాయలు నిర్మించిన తులాభార మండపం, దానిముందు వేయించిన శాసనం నేటికీ ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆలయంలోని దక్షిణ రెండో ప్రాకారంలో ఈ మండపం ఉంది.
నేడు అమరావతి అమరేశ్వరునిగా కొలువందు కుంటున్న స్వామి నాడు ధరణికోట అమరేశ్వరస్వామిగా వెలుగొందాడని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. రాయలు తన భార్య చిన్నాదేవి చేత కృష్ణవేణీ తీరాన రత్నధేను మహాదానం, తిరుమల దేవి చేత సప్తసాగర మహాదానం చేయించి నట్టుగా ఇందులో రాసి ఉంది.
🌿స్థానికంగా ఉన్న ఇతర విశేషాలు:
అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధాని యైన ధాన్యకటకం. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. బౌద్ధమత చరిత్రలో ధాన్యకటకానిది ప్రముఖ స్థానం. ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం.
క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలత కలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే.
మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4 - 3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్నట్టు అధారాలున్నాయి.
బుద్ధుని జీవితకాలము నుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగున పడిన చైత్య ప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది.
దీపాలదిన్నె గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ. అప్పటికే మహాచైత్యం అంతా కూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది. అనేక విడతలుగా జరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు దొరికాయి. ఈ త్రవ్వకాలను సర్ వాల్టర్ స్మిత్ 1845 లో, రాబర్ట్ సీవెల్ 1877 లో, జేమ్స్ బర్గెస్ 1881 లో మరియు అలక్జాండర్ రియ 1888-89 మధ్యలో చేపట్టారు.
ఆఖరున జరిగిన తవ్వకాలలో ఈ చైత్య నిర్మాణానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నివసించిన మెగాలిథ్స్ కి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి.
ఇక్కడ దొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై మరియు బ్రిటిష్ మ్యూజియం, లండన్ లలో భద్రపరిచారు.
ధాన్యకటకంలో 1962-65 మధ్యలో యమ్. వెంకటరామయ్య మరియు కె.రాఘవాచారి ల అధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి. ఇందులో ఐదు కాలాలకు కి సంబంధించిన అధారాలు దొరికాయి. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ పట్టణం క్రీ.పూ.5వ శతాబ్ధికి చెందిందని తెలిసింది.
అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి.
స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్థూపం గురించి అప్పటి బ్రిటిషు పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు: "కళావైదుష్యానికి సంబంధించి ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కట్టడము". దీన్ని చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలలో భద్రపరచారు.
అమరావతికి అతి దగ్గర రైల్వే స్టేషన్ , మంగళగిరి , గుంటూరు. విజయవాడ . .

Friday 7 October 2016

శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి.

ఎనిమిదవరోజు అమ్మవారి అలంకారం. : శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం).

''యా కుందేందు తుషారహార దవళా యాశుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత కరా యశ్వేత పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతి భిర్దేవైస్సదా పూజితా
సమాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా"

నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున అమ్మ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతి. ఈమె బ్రహ్మ చైతన్యంతో హంసవాహనాన్ని అధిష్టించి ఉంటుంది. ఈశ్వరునికి పాదుకాంత దీక్ష ఇచ్చి, చతుష్షష్టి కళలను అనుగ్రహించినది సరస్వతీ దేవి. సంగీత రస స్వరూపమైన నెమలి వాహనంగా, ధవళ వర్ణ వస్త్రాలను ధరించి, అక్షమాలను, వీణను రెండు చేతులతో ధరించి , చందన చర్చితమైన దేహంతో దర్శనమిస్తుంది. సరస్వతి బుద్ధి ప్రదాయిని, వాగ్దేవి. సకల ప్రాణుల నాలికపై ఈ వాగ్దేవత నివసిస్తుందని స్మృతులు చెబుతున్నాయి.

సరస్వతీ దేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. బుద్ధి వికాసం జరుగుతుంది. త్రిశక్తి స్వరూపాలలో ఈ అమ్మ మూడవ శక్తి. సరస్వతీ దేవత విద్యార్థుల పాలిట కల్పవల్లి. పెసరపప్పు పాయసాన్ని సరస్వతీ దేవికి నైవేద్యంగా నివేదించాలి.

నైవేద్యం - పెసరపప్పు పాయసం,అటుకులు,బెల్లం.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు. : గరుడ వాహనం

బ్రహ్మోత్సవాలలో అయిదో రోజు శుక్రవారం రాత్రి మలయప్ప స్వాములవారు ఊరేగే వాహనం గరుడ వాహనం.
మూలవిరాట్టుకున్న మకరకంఠీ,లక్ష్మిహారం మొదలైన వాటిని ఉత్సవమూర్తులకు అలంకరించడం ఈ వాహనం నాటి ప్రతేయ్కత.తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి అండాళ్ అలంకరించుకున్న పూలమాలను స్వామికి అర్పించడం మరో ప్రతేయ్కత. అలాగే కాలినడకన మదరాసు నుండి తేచ్చిన గోడుగుల్న్ని ఈ స్వామి గ్రహించడం,ఉరేగించడం, ఇంకొక ప్రతేయ్కత.అంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆనవాయితిగా పట్టు వస్త్రాలు పంపడం, స్వామివారు ధరించడం మరొక ప్రతేయ్కత
కొత్త గొడుగుల నీడలో ,బంగారు గరుడునిఫై వెంచేసి వరదహస్తుడై స్వామి తిరువిదులలో ఉరేగడం రమణీయమయిన దృశ్యం,పదిరోజులు జరిగే బ్రహ్మోత్సవాలలో ఇది పరాకాష్ఠ. 

గరుత్మంతుడు నిత్యసూరి,స్వామికి దాసుడు,సఖుడు,వాహనం, పతాకచిహ్నం,గరుత్మoతునికి తెలియని స్వామి రహస్యాలు లేవు. గరుడని `పెరియతిరువడి` అనడం వైష్ణవ సంప్రదాయం. గరుడారూదుడైన ఈ స్వామిని అన్నమయ్య వర్ణించిన తిరు మనోహరం.

హనుమద్వాహనం.
బ్రహ్మోత్సవాలలో ఆరవనాటి ఉదయం స్వామివారు ఊరేగే వాహనం హనుమద్వాహనం. త్రేతాయుగంనాటి రాముడే వేంకటేశ్వరుడని నిరూపించడం ఈ వాహనంలోని పరమార్దం.వైష్ణవులు హనుమంతుని `సీరియత్తిరుమడి` అంటారు. గరుత్మంరుడు పెరియత్తిరువడి. బృత్యుల్ని కూడా మన్నించి వారికీ ఉపకారం చేయడం ప్రభువుల విధి. శ్రీరాముడే దేవుడని కొలిచిన భక్తుడు హనుమంతుడు.తన భక్తితత్పరతను చాటిన హనుమంతుడు ద్వార భక్తులు స్పూర్తి పొందడానికి వీలుగా హనుమంత వాహనంఫై స్వామి ఉరేగడం ప్రతేయ్కత. సాయంవేళా స్వర్ణరధసేవ జరగడం విశేషం

Thursday 6 October 2016

ప్రకృతి అందించిన గురువులు

సద్గురువులు కావాలని ఈరోజుల్లో ఎందరో ఎదురుచూస్తున్నారుకాని మనం పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు నిత్యం క్షణకాలం పాటు మనల్ని విడువకుండా ఉండే గురువులును ఎందుకు గుర్తించలేకపోతున్నారు?

🌿ప్రకృతి ఇచ్చిన గురువులు:
నేల, నింగి, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు. ప్రకృతి లో ఉన్న ఈ పంచభూతాలతో నిర్మితమైనదే మానవదేహం.
🌿నేల : ఎందరు ఎన్నిరకాలుగా వాడుకున్నా సహిస్తుంది. నేలకు సహనం సహజగుణం. పుట్టిన దగ్గర నుండి నిన్ను మోసి, చివరికి తనలో కలుపుకుంటుంది. ఇలాంటి నేలను చూసి మీరు ఏమి నేర్చుకున్నారు?

🌿నీరు : ఎన్ని మలినాలు చేసినా సహజంగా శుద్ధి చేసుకుంటుంది. అలానే కాక శుబ్రం చేసే గుణం కలిగి ఉంది. మనషి ఎల్లప్పుడూ శుచిగా ఉండాలనే జ్ఞానాన్ని సూచిస్తుంది. దీనిని చూసి ఏమి నేర్చుకున్నారు ?

🌿నిప్పు : మలినాలను పోగొడుతుంది. దేవతలకు మనం చేసే యజ్ఞంయాగాది క్రతువుల నుండి ఆహారాన్ని అందిస్తుంది. లోకాలకే వెలుగులు ప్రసాదిస్తుంది. నిప్పులో నిర్మలత్వం ఉంది. దీని వలన ఏమి నేర్చుకున్నారు ?

🌿గాలి : ఎప్పుడూ నిరాపేక్షంగా ఉపకారం చేస్తుంది. పువ్వులలో ఉండే పుప్పొడిని తీసుకెళ్ళి పరపరాగ సంపర్కం గావించి వృక్ష సంపదను వృద్ది పొందిస్తుంది. మనిషికి నిరంతరం చెట్లనుండి ఆక్సిజన్ అందిస్తుంది. ఇలా గాలిని పరోపకార బుద్ది నేర్పుతుంది. దానిలో ఉన్న పరోపకార బుద్దిని అలవరచుకున్నారా?

🌿ఆకాశం : ఎన్ని కారుమబ్బులు కమ్ముకున్నా ఆకాశం ఎప్పటికీ నిర్మలంగానే ఉంటుంది. మనిషి జీవితం మాయ ప్రపంచం చుట్టూ తిరుగుతూ మనస్సుకు అనేక మాయలు కల్పిస్తుంది. ఈ మాయల మబ్బుల నుండి వివడటానికి నిర్మలత్వాన్ని చూపిస్తున్న ఆకాశం నుండి ఏమి తెల్సుకున్నారు?

తుమ్మెద పువ్వులలో ఉన్న తేనెను మాత్రమే ఆస్వాదిస్తుంది. మనిషికూడా విషయంలో ఉన్న సారాన్ని మాత్రమే గ్రహించాలి. కాని మనిషి మాత్రం విషయాన్నే వక్రీకరణ బుద్దితో ఆలోచిస్తున్నాడు.

చేపను చూసి జిహ్వ చాపల్యం చంపుకోవాలి. ఎరను చూసి పట్టుకోవాలని ప్రయత్నించి చివరికి చనిపోతుంది. మనిషి కోరికల ఎరకు చిక్కి ఆయుష్షుని తగ్గించేసు కుంటున్నాడు.

చివరికి అమ్మాయి చేతికి ఉన్న గాజు కూడా గురువే. ఒక్కగాజు నిశబ్దంగా ఉంటే నాలుగు గాజులు గోలచేస్తాయి.
ఒంటితనం తోనే మనిషి ఏదైనా సాధించడానికి అవకాశం కలిగిస్తుంది. నలుగురిలో ఉంటే విషయం మీద ధ్యాస తగ్గిపోతుంది.
ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటీ మనకు అనేకరకాలుగా భోదిస్తుంటే మనం మాత్రం పట్టించుకోవడం లేదు. మరి గురువులు చెప్పే విషయాలు వింటారా?

సప్త ఋషులు

కశ్యపోత్రి భరద్వాజాః విశ్వామిత్రోథ గౌతమః!
వశిష్టో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః స్మృతాః!!

భారతీయ పరంపరాగత పౌరాణిక కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉన్నాడు. ప్రాచీన రుషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ రుషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ రుషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు రుషులున్నారు.
ఎంతోమంది రుషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.
1.కశ్యపుడు,
2.అత్రి,
3.భరద్వాజుడు,
4.విశ్వామిత్రుడు,
5.గౌతముడు,
6.జమదగ్ని,
7.వసిష్ఠుడు... వీరు ఏడుగురు పూజనీయులు.

రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు.

1. సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి (మరీచి కళల పుత్రుడు). దక్షప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షలతాత్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.

2. సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.

3. భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.

4. విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.

5. తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు రుషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర రుషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.

6. జమదగ్ని రుషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు.

7. ఏడో రుషి వసిష్ఠుడు. ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.

సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు. ఏడు సముద్రాలు, ఏడు కుల పర్వతాలు, ఏడుగురు రుషులు, ఏడు ద్వీపాలు, ఏడు భువనాలు, ప్రాతఃకాల స్మరణతో శుభాలను కలగజేస్తాయంటారు

శివాలయ దర్శన విధానం

సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చెసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే,శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్సించినట్లే అని చెప్పబడింది.

శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ద్వముఖమై (పైకి చూస్తు/ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది. 5 ముఖాలకి, 5 పేర్లు న నిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా,పూజ చేయోచ్చు అంటారు.

శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమైన శివాలయం.
అంటే, మీరు,గుడిలోకి వెల్లగానే, శివలింగం పశ్చిమం వైపు చూస్థూ ఉంటుంది.. అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా, లేదా, శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా, దానిని, సద్యోజాతజాత శివలింగం అని అంటారు. అప్పుడు మనం తప్పకుండా,అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి.శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం, సద్యోజాత శివలింగం.

శివలింగం, తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటువంటి శివలింగాన్ని, తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది.. తిరోదానము అంటే చీకటిలో ఉంచటం. అది, మనల్ని మాయ చేత కప్పబడిస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది..
ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం.. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం.
సద్యోజాత ముఖం పూజించ తగినదే,ఏ మాత్రం అనుమానం లేదు.. మనల్ని రక్షించినా,శిక్షించినా, అన్ని ఆ పరమేశ్వరుడేగా.
తూర్పుని చూస్తూ ఉండె శివలింగం, వాయువు (గాలి) మీద అదిష్టానం కలిగి ఉంటాడు.. ...
మనకు ప్రతీ శివాలయంలోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి.. శైవాగమనంలో చెప్పినట్లుగా, మనం తప్పకుండా, శివాలయంలో, ఏ దిక్కు వైపు వెలితే,ఆ శివలింగం పేరుని స్మరించాలి.

5ముఖాలు, మనకు 5 ఫలితాలని కలుగచేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే, స్ర్రుష్టి, స్థితి, లయ,తిరోదానము,అనుగ్రహము(మొక్షము) ఇవ్వబడతాయి.. అన్ని ముఖాలు,పూజనీయమైనవే.. అన్ని ముఖాలని మనం పుజించి తీరాల్సిందే.శివలింగం, దక్షిణం వైపు చూస్తూ ఉంటే, అటువంటి ముఖం, దక్షిణామూర్తి స్వరూపం. మనకు, శివాలయంలో, దక్షిణం ని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉంది తీరాలి. అసలు, దక్షిణామూర్తి విగ్రహం లేకుండా, శివాలయాలు కట్టకూడదు.

🌿శివలింగం, దక్షిణానికి చూసే ముఖాన్ని, దక్షిణామూర్తి స్వరూపంగా, చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే, అఘోర ముఖం అంటారు.  ఈ అఘోర ముఖం , అగ్నిహోత్రానికి అంతటికీ, అధిష్టానం అయ్యి ఉంటుందిఈ సమస్త ప్రపంచాన్ని,లయం చేసే స్వరూపమే,ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే, సమస్త ప్రపంచాన్ని లయం చేసి,మళ్ళీ,మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల,భయం పొగొట్టేది,మనకి ఙ్ఞానం ఇచ్చేది ఇదే.మీరు జాగ్రత్తగా గమనిస్తే, చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మొక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

ప్రతీరోజూ, ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ద్యానం చేస్తే, మొక్షము కరతళామలకము. వారి,అంత్యమునందు, సాక్షాత్తు, ఈశ్వరుడే, గుర్తుపెట్టుకొని, మొక్షముని ప్రసాదిస్తాడు. ద్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.

🌿ఉత్తరం వైపు చూసే ముఖంని, "వామదేవ" ముఖం అని అంటారు. ఇప్పటిదాక, 4 దిక్కులని చూస్తున్న, 4ముఖాల గురుంచి తెలుసుకోగలిగాం కదా!.
.
🌿ఇక చివరి ముఖం, శివలింగం పైన (అంటే, ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం) ఉండే ముఖం, ఆ ముఖంని "ఈశాన ముఖం" అంటారు. మనం, లింగం పైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః. అని అనాలి. ఈశాన ముఖ దర్సనం, మనం మిగిలిన 4 ముఖాలని దర్సించిన తర్వతనే దర్సించాలి.. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. 

మనకు కాశీలో ఉండే ముఖం, అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చొని, దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది.
ఉత్తరం వైపు చూసే "వామదేవ ముఖం" నీటి మీద అధిష్టానం అయి ఉంటుంది. ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళమును ఇచ్చే ముఖం. వామదేవ ముఖం అంటే ఎమిటి అనేది మనకు శివపురణంలో చెప్పబడింది. యదార్ధమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే, విష్ణువు శివుడు ఒకరే.. రెండు లేనే లేవు.

శివపురణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికి సంసయం ఉంటే, ఒకటి గమనించండి. శివఫురణం ని రాసినది, వేదవ్యాసుడు.. వ్యాసుడే విష్ణువు. విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ,వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే.. రెండు కాదు.. చాలా మంది, వేరుగా చూస్తూ,పొరపడుతున్నారు.. క్రిష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను. ఈ వామదేవ ముఖం ని, ఓం వామదేవాయ నమః అని అంటే, మనకు అనారోగ్యం కలగకుండా,చూస్తాడు. అంతే కాక, ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే,మనకు 3 ఫలితాలని కూడ ఇస్తుంది..

అవి, 1) మీ దగ్గర ఏదైతో ఉందో, అది మీ చేయి జారి పోకుండ,మీతోనే ఉంచుతాడు. ఉదా: మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి (లేదా) ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ,మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. 

2) మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని అయనే ఇస్తారు.
3) మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యమ్ని ప్రసాదిస్తాడు. ఉదా: ఇప్పుడు, తీపి పదార్దాలని కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్దితిలో (షుగర్ ఉందనుకోండి.) ఉంటే, అప్పుడు, ఉన్న దానిని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండ కాపడతాడు.

తదుపరి,ఈశాన ముఖము. శివాలయలో లింగ దర్శనం అయ్యాక, ఒక్కసారి, పైకి చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి. ఆ ఈశాన ముఖమే మనకు మొక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్టానం అయ్యి ఉంటుంది.
శివలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెల్లినప్పుడు, మనలో ఉండే, అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకోని ముందుకు సాగాలి.

శివాలయలో పురుషులకి, ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేసించబడింది. పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్యం ని, నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో, వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నమవుతాడు. ముందుగా చెప్పినట్లు, పదఘట్టన వినపడకూడదు జాగ్రత్త.

మీరు శివాలయంలో, ఎట్టి పరిస్థితులలోను, విభూధిని కాని, బిల్వ పత్రాలనికాని, కుంకుమ కాని,ప్రసాదం కాని ఎట్టి పరిస్థితులలోను, నందీశ్వరుడి మీద పెట్టరాదు. సాధారణంగా, చాలా మంది, నంది మీద విభూధిని, బిల్వ ఆకులని వేస్తూ ఉంటారు. అది చాలా మహా పాపంగా పరిగణించబడింది.

వీలైతే, అందరూ, శివరాత్రి రోజు, శివమహిమ్నా స్తోత్రం చదవండి.. శివసోత్రాలు అన్నింటిలోకి, చాలా ప్రాముఖ్యమైనది "శివమహిమ్నా స్తోత్రం". . .
Share:

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com