..

Wednesday 5 October 2016

ఇతరుల మీద మీ అభిప్రాయాలు రుద్దకండి..

కష్టం వస్తే మనం దేవుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటున్నాం. అలాంటి దేవుడి దగ్గరకి యాత్రగా వెళితే అయన మనల్ని ఎందుకు కష్టపెడతాడు?

భగవద్గీత చదివితే అందరిలో కలిసి ఉండరు.. యాత్రలకి వెళితే వ్యాపారం దెబ్బతింటుంది. సెలవులు ఇవ్వరు..
వృద్ధాప్యంలో యాత్రలు తిరగాలి, పురాణాలు చదవాలి అని చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దల వరకు లేని పోనీ అపోహలు పెట్టుకొని తాము చెడడమే కాకా అయినవాళ్లు కానివాళ్ళు అని తేడా లేకుండా ప్రక్కన ఉన్నవారిని లేనిపోనివి అన్ని చెప్పి తాము తిరగక చదవక ఇతరులని తిరగనీయక చదవనీయకుండా చేస్తున్నారు.

ఒకటి ఆలోచించండి! కష్టం వస్తే ఎక్కడికి పరిగెడుతున్నారు? దేవుడి దగ్గరికే కదా! మరి ఆదేవుడి కోసం ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అటుగా చేయనీయడంలేదు.? దేవుడి కోసం యాత్రల పేరుతో దర్శనానికి వెళుతుంటే ఉద్యోగం పోతుందని, ఈ వయస్సులో వెళ్లకూడదని, సెలవలు ఇవ్వరని, వ్యాపారం నష్టపోతామని, చెప్పి లేదా సమర్ధించుకొని లేనిపోని సాకులతో సమస్యలు వస్తాయని ఎందుకు అనుకుంటున్నారు?



ఎవరో యాత్రలు చేసొస్తే "ఆహా మీరు అదృష్టవంతులు. చిన్నవయస్సులోనే అన్ని చూస్తున్నారు. మాకు ఎప్పుడు వస్తుందో అవకాశం అనుకోని,  యాత్రలకి వెళితే ఉద్యోగం పోతుంది, లేదా వ్యాపారం పోతుంది, ఇంకేదో అయిపోతుంది అని ఈర్ష్య పడి బాధపడకండి.

దైవం అంటే! మనకి మార్గాన్ని చూపించేదే తప్ప నాశనం చేసేది కాదు. మన మార్గం దైవం వైపే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. గుడికి వెళ్లి ఎన్నో కోర్కెలు కోరటం. అందులో కొన్ని తీరతాయి. కొన్ని తీరవు. అలాగని దేవుడిని "నువ్వు లేవు" అని దూషించమేనా! దేశంలో ఉన్న ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేక ఉంది. ఆయా ఆలయాల దర్శనాలని బట్టి, ఆ క్షేత్ర మహాత్యాలని బట్టి ఒక్కో ఫలితం ఉంటుంది. ఆలా కాకుండా ఉన్నచోటే అన్ని కోర్కెలు తీరాలంటే! మీదగ్గర అంత భక్తి ఉందా! లేదు. ఉండదు. భక్తి లేనప్పుడు కనీసం తీర్థయాత్రలు చేసి కోర్కెలు నెరవేర్చుకోవాలి.

ఇప్పటి తరానికి ముందు తరాలకి తేడా ఏంటంటే! ఇప్పటి తరం ఉన్నచోటే అన్ని పనులు అవ్వాలి అనుకోవడం.. కూర్చున్నచోటే అన్ని పనులు అవ్వాలి అనుకుంటే! ఉదయం లేచిన దగ్గర నుండి మీరు చేసేపనులు ఊహించుకోండి.. బియ్యం తెచ్చుకోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, వాటిని తరగాలి, వండాలి, పళ్లెం లో పెట్టుకొని తినాలి. వీటన్నిటి కోసం డబ్బు సంపాదించాలి. దీనికోసమే నానాగడ్డి కరవాలి, సలామ్ కొట్టాలి.. ఎన్నో పనులు చేస్తే తప్ప పూట గడవదు.  ఒక్కపూట నీకడుపు నింపుకోవడానికే ఎన్నో కష్టాలు పడుతుంటే! నీకు సాధ్యం కాని పనులు చేయించుకోవడానికి ఆశ్రయించే దేవుడి కోసం భక్తితో జీవితంలో ఒకసంవత్సరంలో ఒక నెలలో కనీసం పది రోజులు ఖర్చు చేయలేరా!చెయ్యాలి. దేనికైనా శ్రమ పడితేనే ఫలితం వస్తుంది.



జీవితంలో యాత్రలు చేయడం వలన ఎన్నో విశేషాలు తెలుసుకోవడమే కాకుండా సమస్యలు వచ్చినప్పుడు స్పందించే విషయంలో కూడా చాలా మార్పులు వస్తాయి.

15రోజుల యాత్ర చేశారనుకుందాం! సరైన భోజనం దొరకకపోవచ్చు. అలాంటప్పుడు ఉన్నదాంతో సర్దుకుపోవాలి. తప్పదు. ఉండడానికి సరైన సౌకర్యాలు లభించనప్పుడు కూడా ఉన్న వసతులనే సరిపెట్టుకోవాలి. వెంట ఉండేవారు అనూకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కలిసే ఉండాలి. విడిగా ఉండడం సాధ్యపడకపోవచ్చు. ఇలా ఎన్నో సమస్యలు వాటికి పరిష్కారాలు అనేకం లభిస్తాయి. ఇక అంత శ్రమకి ఓర్చుకొని దైవదర్శనం చేసుకుంటే దేవుడు ఊరుకుంటాడా! నాకోసం ఎంతో శ్రమకి ఓర్చుకొని ఇక్కడికి వచ్చాడు కాబట్టి అడిగిన వరం ఇచ్చేస్తాడు. మంచి మార్గం చూపుతాడు.

మన కోసం కష్టపడేవారి కోసం మనం ఏమి చేయకపోవచ్చు కాని తన కోసం కొంచం కష్టపడినా దైవం చూస్తూ ఊరుకోడు. మంచి మార్గం చూపిస్తాడు. సర్వ కామ్యార్ధ మోక్షాలు ఇచ్చేస్తాడు. ఇది ముమ్మాటికీ నిజం. మహాభారతం భగవద్గీత లాంటి గ్రంథాలు చదివితే మానసిక దృఢత్వం, వాక్పటుత్వం, అజాధ్యం, వాక్సుద్ధి ఇలాంటివి అనేక పెరగడంతోపాటు నలుగురిలో గౌరవం పెరుగుతుంది. ఇంకా ఎన్నో విశేషాలు మీకు తెలుస్తాయి. కనుక చిన్ననాటి నుండే భగవద్గీత లాంటి గ్రంధాలు, కాశి, హృషికేష్, నైమిశారణ్యం, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న దేవాలయ యాత్రలు చేయండి. జీవితాన్ని సస్యశ్యామలం చేసుకొని కష్టాలకి చెక్ పెట్టండి. యాత్రలు చేసేవారికి కాని గ్రంధాలు చెదివేవారికి కానీ కష్టాలు దరిదాపుల్లో ఉండవు గాక ఉండవు.. ఇది సత్యం.

వృద్ధాప్యంలో యాత్రలు చేయాలి. వృద్ధాప్యంలో గ్రంధాలు చదవాలి అనే మూర్ఖపు వాదనలు చేసేవారిని ప్రక్కన పడేయండి.. ఈలోకంలో ఎవరూ ఎవరినీ ఉద్దరించలేరు. మనల్ని మనమే ఉద్దరించుకోవాలి. ఆలా చేయాలంటే ఇవి తప్పకుండ చేసి తీరాలి. ఆదేవుడు తప్ప మనల్ని ఎవరు ఉద్దరించలేరు. ఆయన్ని మనమే పట్టుకోవాలి. పెట్టుకోవాలంటే ఇలా గ్రంధాలు చదివి యాత్రలు చేసి కష్టపడాలి. తప్పదు. మరొక కారణం లేదు.

అడ్మిన్
శ్రీకృష్ణ 
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com