..

Thursday 6 October 2016

శ్రీవారి బ్రహ్మోత్సవాలు : సర్వభూపాల వాహనం.



శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గురువారం రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనం పై ఊరేగనున్నారు. ఏడడుగుల ఎత్తు ,పూర్తీ బంగారు రేకులతో నిర్మించిన వాహనం `సర్వ భూపాల వాహనం` సమర భూపాలవాహన మన్న పేరు శాసనంలో కనబడుతుంది.దేవచోడవంశానికి చెందిన మట్టకుమార అనంతరాయలు ఇచ్చిన వాహనాలలో ఇది ఒకటి.శాలివాహన శకం 1550 లో (క్రి.శ 1628) అయన చేసిన ధర్మకార్యాలను గురించి వివరముల తెలిపే శాసనం పాదాల మండపంలో ఉన్నది. పేరులోనే సాదృశ్యo ఉన్నదీ. ఇది గమనించదగ్గ అంశం. సర్వ భూపాల వేషధారిగా మలయప్పస్వామి నాల్గోవరోజు రాత్రి ఉభయ నాంచారులతో ఊరేగే వాహనం.

మోహిని అవతారం
బ్రహ్మోత్సవాలలో ఐదోవ రోజు ఉదయం మలయప్పవారు `మోహిని` రూపంలో దంతాల పల్లకిలో తిరువిదులలో ఊరేగుతారు.తోడుగా శ్రీకృష్ణ స్వామి మరొక పల్లకి వాహనంలో కొంచెం వెనుక వస్తారు.

ఉత్సవమూర్తి మాములుగా నిలబడే బంగిమలో కాకుండా ఆసీనులై బంగిమలో కనపడడం విశేషం స్త్రీలు ధరించే అన్ని ఆభరణాలతో స్వామివారిని అలంకరించడం ఒక ప్రతేయ్కత.సాదారణంగా వరద భంగిమలో కనిపించే స్వామివారి కుడి హస్తం మోహిని అలంకరణలో అభయ హస్తముద్రతో ఉండడం ఒక ప్రతేయ్కత.స్వామివారికి పట్టు చీర,కిరీటం ఫైన రత్న ఖచితమయిన సూర్య చంద్ర సావేరి ,నాసికకు వజ్రఖచితమయిన ముక్కు పుడక,బులాకి,శంఖచక్రాల స్టానంలో రెండు వికసించిన స్వర్ణ కమలాలను అలంకరిస్తారు

దేవతలు,రాక్షసులు క్షీరసాగరం మదించి అమృతం దక్కగా మాకు మాకని మధనపడేవేళా దుష్టుల్ని శిక్షించడానికి శిస్ట్టుల్ని రక్షించడానికి అతిలోక మోహన మయిన ఆడరూపం ధరించి సురులకు సుధా ప్రధానం చేసిన జగన్మోహన రూపమే మోహిని అవతారం.
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com