..

Wednesday 5 October 2016

శ్రీవారి బ్రహ్మోత్సవాలు : ముత్యపు పందిరి వాహనం.




బ్రహ్మోత్సవంలో మూడోరోజు బుదవారం రాత్రి స్వామి ఊరేగే వాహనం ముత్యపు పందిరి వాహనం.
బకాసురుని వధించిన బాలకృషుని అవతార రూపంలో ఈ వాహనం మీద మలయప్పస్వామి ఉభయ నాంచారులతో తిరువీధులలో సంచరిస్తారు. ఈ వాహన సేవను ముత్తు పందల్,ముత్యపు పందిరి అని అంటారు

ప్రజల నుండి వసూలు చేసిన పన్నులు,సుంకాలు,ఇతర బహుమతుల్ని భద్రపరచిన ప్రభువు కరువు కాటకాల క్లిష్ట పరిస్టితుల్లో ప్రజలను ఆదుకుంటారని చెప్పడం ఈ వాహనం పరమార్దం. ముత్యపుపందిరిని ఆదిశేషుని వేయి పడగలకు ప్రతిక. శేషుని పడగల నీడలో స్వామి ముత్యాల పందిరిలో నిలిచినట్టు శుక మహర్షికి కనబడ్డాడు(పద్మ పురాణం)..

కల్పవృక్ష వాహనం : బ్రహ్మోత్సవం వేళా నాలుగోరోజు గురువారం ఉదయం మలయప్ప శ్రీదేవి భూదేవులతో ఊరేగే వాహనం కల్ప వృక్ష వాహనం ఇది రాజమన్నార్ అవతారం. కల్పవృక్షం,కామధేనువు,చింతామణి మొదలయినవి కోరిన కోరికలను ప్రసాదిస్తాయని నమ్మకం తనను శరణు జొచ్చిన భక్తుల కోరికలను స్వామి నెరవేరుస్తారని చెప్పడానికే కల్ప వృక్ష వాహనం ఫై స్వామిని ఊరేగిస్తారు కల్ప వృక్షం సకల ఫలప్రదాయకం.అన్ని వృక్షములు ఆయా ఫలములనిస్తే కల్పవృక్షం. అన్ని వృక్షముల ఫలాలను కోరిన వెంటనే ఇవ్వగలదు.అటువంటిదానికి ప్రభువు శ్రీనివాసుడు అని అంతరాద్దం.
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com