..

Monday 2 December 2013

అసలు దండనీతి ఎందుకు?

Please Visit : http://telugupennidhi.com/index.php/te" more updates.



అంపశయ్య మీద ఉన్న భీష్ముడిని ధర్మరాజు! అసలు దండనీతి ఎందుకు? దండం లేకుండా ప్రజలని, కుటుంబాన్ని పాలించలేమా?
భీష్ముడు: సృష్టిని నాశనం చేసేది ఒకే ఒక్క ఆయుధం. విచ్చలవిడితనం. దండం లేకపోతె ప్రజలేకాదు కుటుంబసభ్యులు కూడా మాట వినరు. 
సృష్టి ఆరంభ సమయంలో బ్రహ్మ ఒక యజ్ఞం చేయాలనీ సంకల్పించి క్షుతుడు అనే ఋత్విక్కుని సృష్టించాడు. అతనితో! నువ్వు సృష్టి కోసం ఒక యజ్ఞం చేయించాలి నాతో, కనుక అన్ని ఏర్పాట్లు చెయ్యి అని పంపించాడు. ఆ ఋత్విక్కు వెళ్లి అక్కడ ఉన్నవారితో నువ్వు ఇటుకలు తీసుకురా, నువ్వు ఆవుని తీసుకురా! నువ్వు నీళ్ళు తీసుకునిరా అంటుంటే ఎవ్వరూ వినడంలేదు. ఇంతింత బొజ్జలు వేసుకుని కదలకుండా ''ఆ చేద్దాం, ఆ చూద్దాం'' అనుకుంటూ అవులిస్తున్నారు. దీనితో ఆ ఋత్విక్కు భయపడి బ్రహ్మ దగ్గరికి వచ్చి దేవా! నువ్వేమో యజ్ఞం చేయమంటావు. కాని ఎవరూ మాట వినడంలేదు. కొట్టినా, తిట్టినా కదలడంలేదు. ఎవరు ఏమాట వినడంలేదు. ఇలా ఐతే ఎలా చేయించాలి. నావల్ల కాదు. అనగానే బ్రహ్మ, విష్ణువు కలిసి శివుడిదగ్గరికి వెళ్తారు. శివుడితో విషయం చెప్పి ఏమిచేయాలి అని మౌనంగా ఉన్నారు. ఇంతలో శివుడు దండంతో పాటు దండనీతిని సృష్టించాడు. ఇక నుండి దండం నేనే, దండనీతి నేనే! ఈ ప్రపంచాన్నంతా అల్లకల్లోలం చేసేది విచ్చలవిడి తనం. ప్రజలు, కుటుంబం అదుపుతప్పకుండా ఉండాలంటే ప్రభువు, ఇంటి యజమాని శిక్షించాలి. దండం,దండనీతి ఉపయోగించాలి. ప్రభువులు చట్టం చేయాలి. ఈ పని చేస్తే శిక్ష, ఈ పని చేస్తే రక్ష. ప్రతి వ్యక్తికీ ఇది నీటిని నేర్పే అద్భుత శాస్త్రం ఈ దండనీతి. దండనీతి ఉపయోగించేటప్పుడు కర్ర ఒకటి పక్కన ఉండాలి. నీతి విన్నాడా రక్షించాలి. వినలేదా శిక్షించాలి. ఈనాటినుండి దండం దండనీతి నేనే అని ఆనాటినుండి శివుడు లయకారకుడు అనే పేరుపొందాడు. ఆనాటినుండే వర్ణాశ్రమ ధర్మాలు వచ్చాయి. ఒరేయ్ నువ్వు ఈపని చెయ్యి అంటే చెయ్యాలి. లేదా ఒక్కటి ఇవ్వడమే. ఇలా కొంతకాలానికి ఈగుంపు అంతా ఈపని చేయండి. ఈగుంపు అంతా ఈపని చేయండి అని గుణకర్మములు వారివారి సామర్ధ్యములను బట్టి వారి వారి చేత పనులు చేయించడం మొదలుపెట్టారు. ఆనాటి నుండి పరమేశ్వరుడి వలన సృష్టి ఈవిధంగా చక్కగా నడుస్తుంది. భయం లేకపోవడం వలన మానవుడు అదుపుతప్పుతాడు. కాబట్టి శిక్షించవలసిందే. లేదంటే ఎవరికీ వారు కోట్లు సంపాదించి ప్రభుత్వాన్ని, ప్రజలని ఇబ్బంది పెడతారు. ఆనాటి నుండి ప్రజలు సుఖశాంతులతో బ్రతకడానికి, సంపాదించుకుని ధర్మ అర్ధ, కామ, మోక్షములు సాధించడానికి! ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే 4వేదాలు, శిక్ష, వ్యాకరణం, జ్యోతిష్యం, కల్పం, నిరుత్తం, ఛందస్సు అనే షడంగాలు, ఇవి కాకుండా పురాణం, ధర్మశాస్త్రం, న్యాయ శాస్త్రం, పూర్వోత్తర మీమాంస శాస్త్రం, ఇవి నాలుగు వీటితో పాటుగా వైద్య విద్యా, విలువిద్య, సంగీతం, నీతిశాస్త్రం లేక న్యాయవిద్య, ఇవి నాలుగు ఉప వేదాంగాలు కలిపితే మొత్తం 18 విద్యలు. ఈ అష్టాదశ విద్యలు పెట్టి వీటిని నేర్చుకోండి. వీటివలన మీ కర్తవ్యా కర్తవ్యాలు తెలుస్తాయి. అన్నిరకాలుగా రంగాలలో ఆరితెరుతారు. ఇవన్ని కలిస్తే లోకం అంతా సుఖంగా వుంటుంది. అని వీటికి లోకానికి అందజేశాడు. చివరికి దండనీతితో నువ్వు ఇది చదవమన్నాను కదా చదవ్వే , ఇదిగో నీకు సంగీతం పాడటం అలవాటు కదా పాడవే? పాడు. ఇదిగో నువ్వు కల్పం, నువ్వు జ్యోతిష్యం అని చెప్పేవాడు.
ఇదికూడా మళ్లి పుట్టుకతో కాదు. వారి వారి ప్రవర్తనను బట్టి,వారికీ దానిమీద ఉన్న ఆసక్తిని బట్టి నేర్పేవారు. (ఇప్పటికి కొందరిని చుడండి. కొందరికి ఆటలంటే ఇష్టం, కొందరికి రిపేర్లు చేయాలంటే ఇష్టం, కొందరికి సంగీతం అంటే, ఇంకొందరికి నటించడం, మరికొందరికి చదవడం, వ్రాయడం, కవితలు చెప్పడం ఇష్టం. మీలో చాలామందికి మీరు చేసే వృత్తులు కాకుండా కొన్నిటిమీద ప్రత్యెక అభిమానం ఉంటుంది.) ఇవన్ని దండనీతితో మహారాజుల ద్వార అమలుచేయించేవాడు.
అలా దండనీతి తోనే ధర్మం, న్యాయం ప్రవర్ద్దిల్లుతాయి. అంతేకాని మాటలతో వినరు. అని ధర్మరాజుకి దండనీతి గురించి తెలియజేశాడు
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com