..

Sunday 10 November 2013

తాముచేసిన దుష్కర్మలకు ఆ జన్మలో ఫలితాలు అనుభవించరు

 తాముచేసిన దుష్కర్మలకు ఆ జన్మలో ఫలితాలు అనుభవించరు అంటున్నారు బాగానే ఉంది కాని చేసిన తప్పులకి కారాగారాలలో శిక్షలు వేస్తున్నారు కాదా! అది ఆజన్మలో చేసిన శిక్షానుభూతి కాదా?

కేవలం రాజసాహంకరాలతో దండిస్తున్నారు అనే అపవాదునుండి బయటపడటం కోసమే అపరాధులకు శిక్షలు ఏర్పరచి శిక్షిస్తున్నారు. అదీగాక ఇతరులు ఎవ్వరూ అటువంటి అపరాధాలు(నేరాలు) చేయాలనే ఆలోచనకూడా రాకుండా చేయడమే దీనికి ప్రధానమైన హేతువు, అంతేగాని అదేజన్మలో చేసిన కృత్యానికి ఇది తగిన పరిణామం కాదు.

మరి అపరాధులకు వేసిన శిక్ష వలన పాపం పూర్తిగా తొలగిపోతుందా?
ఇలా చేసినదానికి భూపాలకుడు వేసిన శిక్షితుడు ఎవ్వరు యమదైవతం పాలబడరు. అయితే అపరాధి కానివానిని శిక్షించినా, చేయనివానిని దండించినా నృపతికి తప్పక నరకలోకం చేరుకోగలడు. యమదండం తప్పనిసరి. ఎటువంటి వారైన వారుచేసిన అపరాధాలకు ఫలితాలను అవశ్యం అనుభవించి తీరవలసినదే!
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com