..

Wednesday 13 November 2013

గురవుకి ఉపాధ్యాయుడికి తేడా ఏంటి?

      విద్య నేర్పేది గురువు. ఇప్పుడు మనం నేర్చుకునే విద్యలు నేర్పేది ఉపాధ్యాయులు . ఉపాధ్యాయులు  సందేహలని నివృత్తి చేస్తారు. అది కూడా కేవలం విద్య వరకు మాత్రమే.గణితశాస్త్రం  చెప్పే ఉపాధ్యాయుడు గణితంలో వచ్చే సందేహాలను ఒక స్థాయి వరకు నివృత్తి చేస్తాడు. మరో శాస్త్రం చెప్పే ఉపాధ్యాయుడు అందులోని సందేహాలను నివృత్తి చేస్తాడు. కాని గురువు దగ్గర కి జీవితంలో నువ్వు ఎలాంటి ఎలాంటి సమస్యని   గాని  సందేహన్నిగాని తీసుకెళ్ళినా పరిష్కారం చూపిస్తాడు. గురువుది శాసనం. చెప్పింది చేయాలి. గురువు చెప్పిన ముహూర్తంలో చేయాలి. అంతేకాని ఫలానా అప్పుడు చేయకూడదా? అనే ప్రశ్నలకి తావులేదు. ఒకడు గురువుదగ్గరికి వెళ్లి నేను ఫలానావ్యాపారం చేయాలి అనుకుంటున్నాను. సరైన సమయం చెప్పండి అంటే గరువు చూసి రేపో లేక ఫలానా తేదినో బాగుంది అని చెప్పినప్పుడు కాదండీ ఎల్లుండు ఎందుకు బాగోలేదు? రేపు అని ఎదురు ప్రశ్నలు వేస్తె! నువ్వు వెళ్ళింది సలహా కోసమా? లేక నిర్ణయం కోసమా? నిర్ణయం పాటించాల్సిందే! సలహాకోసం గురువుల దగ్గరికి వెళ్ళాల్సిన పనేముంది? చాలామంది ఉన్నారు కదా స్నేహితులు, తల్లితండ్రులు.. గురువుతో ఎం పని?
గురువు శాసిస్తాడు. శాసనం అనుసరించడమే! జీవితంలో ఎలాంటి సమస్యతో గాని  సందేహంతో వచ్చినా నివృత్తి చేసేది ఒక్క ఆధ్యాత్మిక గురువు మాత్రమే! ఉపాధ్యాయుడు తనకి తెలిసిన శాస్త్రంలో మాత్రమే సందేహ నివృత్తి చేస్తాడు. 
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com