..

Tuesday 12 November 2013

శీలం అంటే ఏమిటి?

మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది శీలం. అమ్మాయిలని మానభంగాలు చేస్తే పోయేది కాదు శీలం అంటే.

దీనికి ఒక పురాతన ఇతిహాసం ఒకటి చెప్పుకుందాం.
హిరణ్యకశిపుడు పుత్రుడు ప్రహ్లాదుడు ముల్లోకాలని తన శీలంతో సంపాదించుకున్నాడు. ఒకచిన్న గొడవగాని, యుద్డంకాని చేయలేదు. కాని ముల్లోకాలలో ఉన్నవారంతా ప్రహ్లాదుడికి మొక్కుతున్నారు. ఇంద్రుడి పదవి కూడా ప్రహ్లాదుడి వశం అయింది. ఇంద్రుడికి ఏమి అర్ధం కాలేదు. అర్రర్రే ఏంటి ఇలాజరిగింది. గొడవగాని, యుద్ధం గాని మా మధ్య జరగలేదు. నా పదవిపోయింది. దేవతలందరూ ప్రహ్లాదుడి పాదాక్రాంతులు అయ్యారు. సంపదలు అన్ని ప్రహ్లాడుదికే ఇచ్చేస్తున్నారు. అసలేం జరిగిందో తెలియక దేవతల గురువైన ''బృహస్పతి'' దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలియజేశాడు. నా రాజ్యం నాకు ఇప్పించమని ప్రాదేయపడ్డాడు. అప్పుడు బృహస్పతి! నాయన ప్రహ్లాదుడు అమేయమైన శక్తి సంపన్నుడు. విష్ణు భక్తుడు. ఆయన్ని మంత్రశక్తితో ఎదిరించి ఓడించే శక్తి నా దగ్గర లేదు. ఐతే ఒకపని చెయ్యి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళు. నీ ప్రయత్నం సఫలం కావచ్చు అన్నాడు. సరేనని ఇంద్రుడు రాక్షస గురువైన శుకచార్యుడు దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నాడు. అయన నాయనా! ప్రహ్లాదుడు నా ప్రియ శిష్యుడు. గురువు ఎవ్వరైనా శిష్యులకి ద్రోహం చేస్తారా? నేను చెప్పలేను. కానీ ఒక సలహా ఇస్తాను ప్రయత్నం చెయ్యి అనగానే సరే చెప్పమన్నాడు ఇంద్రుడు. నువ్వే వెళ్లి అడుగు. ప్రహ్లాదుడు ఉత్తముడు. అడిగితె కాదనడు. అన్నాడు. సరే అని ప్రహ్లాదుడి దగ్గరికి బయలుదేరాడు. మధ్యలో సందేహం వచ్చి ఇలా ఇంద్రుడి రూపంలో వెళ్తే చెప్పడేమో అనుకుని బ్రాహ్మణులంటే ప్రహ్లాదుడికి అత్యంత ప్రీతికరం. వాళ్ళు అడిగితె అస్సలు కాదనడు అని బ్రాహ్మణ వేషధారియై ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రహ్లాదుడిని చూడగానే నేను మీ శిష్యుడిని అని పాదాలపై పడ్డాడు. అప్పుడు ప్రహ్లాదుడు! మీరు ఎవరో బ్రాహ్మణోత్తములు లా ఉన్నారు. నేను మీకు గురువునేంటి అన్నాడు. ఆ విష్ణువే మిమ్మల్ని గురువుగా స్వీకరించమన్నాడు. మీరు నాకు గురువులే అన్నాడు ఇంద్రుడు. పాదాలపై పడి గురువు అన్నతరువాత చేయగలిగింది లేక సరే అని ఒప్పుకున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలపాటు ఇంద్రుడు ప్రహ్లాదుడికి సేవ చేశాడు. ఒకానొక శుభముహూర్తంలో ప్రహ్లాదుడు ఇంద్రుడితో! ఇన్నాళ్ళనుండి నాకు సేవ చేశావు. కనుక ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు.
ఇంతకాలం దీనికోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు! దొరికాడు అనుకుని, అడిగిన తరువాత కాదనకూడదు అన్నాడు. సరే ఏమికావలో చెప్పు అన్నాడు ప్రహ్లాదుడు. నువ్వు ఈమూడు లోకాలకి అధిపతివి ఎలా అయ్యారో చెప్పండి  అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు! ఇది నాశీలం వలనే సాధ్యం అయింది. నేను రాజుని అని ఎప్పుడు పొంగిపోలేదు. ఆత్మస్తుతి చేసుకోలేదు. రాజునని భోగాలు అనుభవించలేదు. సంపదలు వున్నా, లేకున్నా ఒక్కటే, పట్టు పాన్పు అయినా, కటిక నేల అయిన ఒక్కటే, పంచభక్ష్య పరమాన్నాలు అయినా కందమూల ఫలాదులు అయిన ఒకటే. ఆదేవాది దేవుడు అయినా, కటిక దరిద్రుడు అయినా సమానంగానే చూస్తాను. ఈసృష్టిలో అన్నిటిని ఒకేలా చూస్తాను ఇదంతా శీలం వలనే సాధ్యం అయింది అన్నాడు. అయితే ఆ శీలం నాకు ఇచ్చేయ్ అన్నాడు ఇంద్రుడు. ఏదైనా ఇవ్వోచు గాని శీలాన్ని ఇచ్చేస్తే ఎలా? నా తేజస్సు సర్వం కోల్పోతాను కాదా అని సరేనని నాశీలం ఇచ్చేస్తున్నాను అన్నాడు.
ఆ మాట అలా వచ్చిందో లేదో శరీరంలో నుండి దివ్యమైన తేజస్సుతో ఒక పురుషుడు బయటికి వచ్చాడు. ప్రహ్లాదుడు చూసి ఎవరు నువ్వు అన్నాడు. నువ్వు దానం చేసిన శీలాన్ని అన్నాడు. ఓహో అనుకున్నాడు. ఇంతలో ఇంకో పురుషుడు వచ్చాడు. నువ్వెవరు అన్నాడు. నేను ధర్మాన్ని అన్నాడు. నువ్వెందుకు వెళ్తున్నావ్ అంటే , శీలం ఉన్నచోటే ధర్మం ఉంటుంది కనుక వెళ్తున్నాను అని ఇంద్రుడి శరీరంలోకి వెళ్ళిపోయాడు. ఇంకో పురుషుడు బయటికి వచ్చాడు. నువ్వెవరు అన్నాడు. నేను సత్యాన్ని. శీలం, ధర్మం, ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అన్నాడు. కొంత సేపటికి ఇంకో పురుషుడు వచ్చాడు. నువ్వెవరు అని అడిగాడు. నేను నీ బలాన్ని. శీలం, ధర్మం, సత్యం, ఎక్కడుంటే అక్కడే నేనుంటాను అని ఈయనకూడా ఇంద్రుడి శరీరంలోకి వెళ్ళిపోయాడు. బలం వెళ్ళిపోగానే ప్రహ్లాదుడి శరీరం కృంగిపోయింది. ఇంకొంతసేపటికి స్త్రీ రూపం ఒకటి బయటికి వచ్చింది. ప్రహ్లాదుడు ఒణికి పోతూ నువ్వెవరమ్మా అన్నాడు. నేను సిరిని, లక్ష్మి అంటారు అంతా! శీలం, ధర్మం, సత్యం, బలం, సౌచం ఎక్కడ వుంటే నేను అక్కడ ఉంటాను. వీరందరు నీలో నుండి నిష్క్రమించారు కనుక నేను ఉండలేను అని ఇంద్రుడిలోకి వెళ్ళిపోయింది. ప్రహ్లాదుడికి సందేహం వచ్చి ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగాడు ఇంద్రుడిని. నేను ఇంద్రుడిని అని చెప్పి  స్వర్గానికి వెళ్ళిపోయాడు.
తరువాత విష్ణువు ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి నువ్వు ఇచ్చిన శీలం ఇంద్రుడిలో ప్రహ్లాద శీలంగా ఇంద్రుడికి సంపదలు ఇస్తుంది. నీకు నాతొ సమానమైన శీలాన్ని ఇస్తున్నాను. నేను ఎన్ని లీలలు చేయగలనో అన్ని లీలలు నువ్వు చేయగలవు అని ప్రహ్లాదుడికి శీలాన్ని ఇచ్చి పాతాళలోకానికి రాజుని చేసి ప్రహ్లాదుడిని రక్షించాడు.

విన్నారు కాదా! మీరు కూడా ఏ అడ్డమైన చెత్త పనులకోసమో పైన చెప్పినవి వదిలేస్తే శీలాన్ని కోల్పోతారు. ప్రభావాన్ని, తేజస్సుని కోల్పోతారు. ప్రహ్లాదుడంటే విష్ణువుకి అత్యంత ప్రియమైన భక్తుడు కనుక వెంటనే వచ్చి రక్షించాడు. మనల్ని కనీసం పక్కింటోడు కనీసం పూట కూడా భోజనం పెట్టాడు.  మనం చేసే పాపాలకి ప్రత్యేకంగా దేవుడు ఎందుకు వస్తాడు. కనుక జాగ్రత్త ఉండండి. 
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com