..

Saturday 16 November 2013

యుగతత్వం

Please Visit : http://telugupennidhi.com/index.php/te" more updates.

    కాలపురుషుడు కాలం నడిపించడం కోసం బ్రహ్మ ఆజ్ఞాపించగా, తన దేవేరితో కలిసి నలుగురు సంతానాన్ని పొందాడు. వారిలో మొదటివాడు సత్యయుగుడు, రెండోవాడు త్రేతా, మూడవవాడు ద్వాపర, నాల్గవవాడు కలిపురుషుడు.

ఇందులో సత్యయుగుడు తెల్లని వర్ణంలో ఉన్నాడు. త్రేతాయుగుడు ఆకుపచ్చని వర్ణంలో, ద్వాపరుడు ఎరుపు వర్ణంలో, కలి అయ్యప్ప మాలలు వేస్తారు కదా ఆ బట్టల రంగులో వున్నాడు.
మొదటివాడు మౌనంగా ఉన్నాడు. రెండోవాడు కొద్దిగా మాట్లాడాలి కనుక మాట్లాడాడు. మూడోవాడు అన్న మాట్లాడుతున్నాడు కదా అని మాట్లాడుతున్నాడు. నాలుగవవాడు లోడలోడా మాట్లాడేస్తున్నాడు.
నాలుగోవాడు! నన్ను కన్నావు నాకు ఇల్లు కావలి, ఎకరం పొలం కావలి, చేయడానికి పని కావాలి, బ్రతకడానికి ఆస్థి కావాలి. కావలి! కావాలి! కావలి! అని తెగ గోల గోల చేస్తున్నాడు. దీనితో విరాట్ కి విసుగొచ్చింది. ఇప్పటివరకు పిల్లలు లేరు అనుకున్నాను. పిల్లలు వచ్చేసరికి గోల గోల ఏంటి? అనుకుని వీడితో పడలేకపోతున్నా అని! ఒక నిస్సారమైన భూమిని, ఒక ఇంటిని, లవణ సముద్రాన్ని ఇచ్చి ఇవ్వు ఇవ్వు అన్నావు కదా తీసుకో అని కలికి ఇచ్చి వెళ్ళమన్నాడు. (తల్లిదండ్రులని పీదించెవారు. కోర్టులో దావాలు వేసి ఆస్థులు గెలుచుకునే ప్రభుద్దులు ఉంటారు కదా! వారికి దక్కేది ఇలాంటి దిక్కుమాలిన ఆస్తులే. గెలుచుకున్నాం అనే పేరు మాత్రమే ఉంటుంది.)
మూడో వాడు! నాన్నగారు తమ్ముడికి ఇచ్చారు మరి నాకు ఇవ్వరా? అడగలేదనుకుంటారని ఊరుకుకోకండి. అన్నాడు. వీడికి మంచినీటితో ఉన్న సముద్రాన్ని ఇచ్చాడు. కొద్దో గొప్పో పండే భూమిని ఇచ్చాడు. మంచి సుందరమైన ఇంటిని కట్టి ఇచ్చాడు. ఇంతలో పనికూడా చూపించండి అన్నాడు ద్వాపరుడు. మీ తమ్ముడు కంటే ముందే నీకు ఇస్తాను. నీకు ఇచ్చిన తరువాతే మీ తమ్ముడికి అన్నాడు. ఇచ్చినవి తీసుకుని ద్వాపరుడు వెళ్ళిపోయాడు.
ఇక రెండోవాడు! నాన్నగారు ఇలా అడుగుతున్నాను అని ఏమి అనుకోకండి. నాకు కూడా ఏదైనా దారి చూపించండి. ఇబ్బంది లేకపోతేనే అన్నాడు వినయంగా. ఇంత వినయంగా అడిగావు కనుక నీకు పాల సముద్రం, మంచి ఆవులు, మంచి పంట భూములు ఇస్తున్నాను తీసుకో అన్నాడు. సంతోషించి తీసుకుని త్రేతుడు కూడా వెళ్ళిపోయాడు.
ఇక మిగిలింది ద్వాపరుడు! ఈసారి తండ్రే అడిగాడు. నాయనా సత్య! ఎవరికీ వారు అడిగి తీసుకుని వెళ్ళిపోయారు. నువ్వేమిటి మౌనంగా ఉన్నావు. ఏమి వద్దా? ఏమికావలో అడుగునయనా! అనగానే!
నాన్నగారు! ఈ శరీరం మీరు ఇచ్చింది. నేను ఎవరిని అడగడానికి. ఈ శరీరంతో మీకు ఏది కావాలో అది చేయించుకోండి. అడిగే అర్హత నాకు లేదు. మీ ఇష్టం నాన్నగారు. మీరు ఏది చెపితే అది చేస్తాను అనగానే. తండ్రి సంతోషించి పుత్రుడివి అంటే నువ్వే. కాబట్టి నీకు అమృతం ఇస్తున్నాను తీసుకో అని అమృతం ఇచ్చాడు.

ఇదే కాల ప్రభావం. నాలుగు యుగముల తీరు తెన్నులు. సత్య యుగంలో 4పాదాలు ధర్మం వుంది. ధర్మం తప్ప ఇంకొకటి లేదు. ఎవరిదైనా నగ పొతే ఇంటికి వెళ్లి ఇచ్చేవారు. త్రేతాయుగంలో ఒకపాదం తగ్గింది. చాటింపు వేస్తె నగ పోయినవారు వచ్చి తీసుకెళ్ళేవారు. చాటింపు వేసినందుకు ఎంతోకొంత ద్రవ్యం తీసుకునేవారు. ద్వాపరయుగంలో రెండు పాదాలు తగ్గాయి. సగానికి సగం తీసుకుని ఇచ్చేవారు. ఈ మూడు యుగాల్లో పోయిన వస్తువు ఏదో ఒక రూపంలో యజమానికే చేరేది. ఇక కలియుగంలో 3పాదాలు తగ్గి ఏదైనా దొరికితే ఎవరుచుడటం లేదు కదా అని చటుక్కున తీసుకుని లటుక్కున జీబులో వేసుకునేవారు 90% పెరిగిపోయారు.
దీనికితోడు అలసత్వం, సోమరితనం, బుద్దిమాన్యులు, అల్పాయుష్కులు. రోగపీడితులు.
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com