..

Friday 15 November 2013

ఆత్మకి లింగబేధం లేదు

      ఆత్మకి లింగబేధం లేదు. అది ఒక జ్యోతిలా ఒడ్లగింజ అంత ఉంటుంది. చేసిన పాపాలను, పుణ్యాలను బట్టి ఆత్మను తీసుకెళ్ళేవారు వస్తారు. పాపం మరీ ఎక్కువ చేస్తే 3యమబటులు వస్తారు. పుణ్యం చేస్తే దివ్య పురుషుడు వచ్చి తీసుకెళతాడు.  చేసిన కర్మని బట్టి యాతనా దేహం, భోగ దేహం అని 2 దేహాలు ఉంటాయి. పాపం చేస్తే యాతనాదేహంలో ప్రవేశపెట్టి కాలే కాలే ఎర్రటి ఇసుకలో ఈడ్చుకుంటూ తీసుకెళతారు. దాహంతో అలమటించి పోతుంది. అప్పుడు వైతరుణి నదిలో మలముత్రాదులు, చీము నెత్తురు తాగి దాహం తీర్చుకుంటారు. ఇంకో పక్క చేసిన పాపాలను గుర్తుచేస్తూ కొరడాలతో కొడుతూ ఉంటారు. (ఇంకా చెప్తే ధడచుకుంటారు). ఏదైనా కొద్దిగా పుణ్యం ఉంటే స్వర్గానికి తీసుకెళ్ళి చూపించి నరకానికి ఈడ్చుకోస్తారు. అదే పుణ్యం ఎక్కువచేస్తే బోగాదేహంలో ప్రవేశపెట్టి రాచమర్యదాలతో స్వర్గానికి తీసుకెళతారు. ఎంతోకొంత పాపం ఉంటుంది కనుక ముందు యమలోకం తీసుకెళ్ళి చిన్నపాటి శిక్షలు వేసి స్వర్గానికి తీసుకెళతారు.

మనకి ఇలాంటి ఇబ్బందులు రాకూడదని విష్ణుమూర్తి వ్యాస భగవానుడు రూపంలో అవతారం దాల్చి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలూ, ఇతిహాసాలు , ఇంకా 18 విద్యలు నేర్చుకోండి అని వ్రాసి ఇస్తే వాటిని వదిలేసి (చూడలేదు కనుక నమ్మం) పిచ్చి చదువులు చదువుకుంటూ, బుద్దికి తోచిన పనులు చేస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటివి చిన్ననాటి నుండే చదవడం మొదలు పెడితే తల్లి దండ్రులని ఎలా గౌరవించాలి? సంఘంలో ఎలా బ్రతకాలి? భార్యతో ఎలా ఉండాలి? పరస్త్రీలతో ఎలా మెసలాలి? ఆహార నియమాలు ఎలాపాటించాలి? సంప్రదాయాలు ఎందుకు ఆచరించాలి? అనే విషయాలు తెలుస్తాయి. అంతేకాని ఇవన్ని వదిలేసి మంచి సంతానం కావాలి? మంచి భర్త/భార్య కావాలి. మంచి స్నేహితులు కావాలి. ఎక్కడికి వెళ్ళినా గౌరవంగా చూడాలి అంటే ఎలా కుదురుతుంది? సృష్టిని నాశనం చేసేది విచ్చలవిడి తనం. పైన చెప్పినవి తెలుసుకోకపోతే వుండేది విచ్చలవిడితనమే. దీనివలన మీ కుటుంబమే కాదు ప్రకృతికి కూడా ప్రమాదమే!
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com