..

Sunday, 10 November 2013

మనం పూర్వజన్మలో చేసిన తప్పుల వలన ఇప్పుడు అనుభవిస్తున్న శిక్షలు.

 ఇవి తెలుసుకున్న తరువాత కూడా ఇలానే చేస్తే ఇప్పుడు పడే భాధలు కోటింతలు మరుసటి జన్మలో అనుభవిస్తారు. కాబట్టి చదువుకుని జాగ్రత్తతో మెలగండి. 

పుట్టుగుడ్డి గతజన్మలో అందగాడై తన సోయగంతో మైమరచి ఇతరుల భార్యలని ఆకర్షించిన పరమపాపి. కర్ణరోగార్తుడు(చెవిటివారు) ముందు పుట్టుకలో కటువైన మాటలతో సజ్జనులను ఎంతో మానసికవ్యధ కలిగించిన కటినుడు. ఉదర రోగాములతో బాధపడేవారు గతజన్మలో విషభోజనంతో పరులను అన్యాయంగా వేధించిన ధురాత్ముడు. పవిత్ర వంశంలో జన్మించి పాపపు పనులకి పాల్పడేవారు పూర్వజన్మలో గర్వం, అహంకారాలతో పూజ్యులని అవమానించిన పరమ పాపాత్ములు. తప్పులు ఏమి లేకపోయినా గర్వాతిరేకంతో దూషణలో, శారీరక హింసలతో, శిక్షలతో పరిజనులను ఈసడించి అవమానించిన దురాత్ములు ఇతరులకు దాసులై చీటికిమాటికి దూషణలతో శిక్షలతో ఎడతెగని దుఃఖాలు అనుభవించగలరు. ధనవంతుల గృహము ప్రాంగణము నందు ద్వారపాలకులు అడ్డగించినందువలన మిక్కిలి దైన్యంతో అలమటిస్తున్న జనులు వెనుకటి పుట్టుకలో యవ్వనంతో, మదంతో మైమరచి పూజ్యులవైపు కన్నెత్తైనా చూడక,ధర్శనమీయక తిరస్కరించిన దుర్గర్వితులు. అపరాధం చేయనివారిని అన్యాయంగా శిక్షించిన యెడల మరుజన్మలో రాజ దండనము సంప్రాప్తించగలదు. పరులు ఎవ్వరైనా తనదగ్గర సొమ్ము దచుకున్నయెడల ఏదో నెపంతో అపహరించిన దుష్టాత్ములు మరుజన్మలో సంపద మొత్తం ఒక్కమారుగా నశించిపొగలధు. ఏమాత్రము కరుణ లేక అనేకమంది మనుషులను ఒక్కమారుగా నిర్మూలించిన వారు బాంధవులతో, కుటుంబంతో ఒక్కుమ్మడిగా పరలోకం చేరుకోగలరు. ఇంకా ఇటువంటి పాపాత్ములు తప్పక భీకర నరకాగ్ని జ్వాలల్లో కూలిపోగలరు. అయితే ఎక్కువగా పాపకర్మలు చేసిన మానవులు ఒక్కొక్కప్పుడు తిరిగి మానవజన్మ వస్తుంది. అయితే దుశ్చర్యలు ఆచరించినప్పుడు అదే జన్మలో ఫలితమెప్పుడు సంఘటిల్లదు. కాని మునీశ్వరులు, యక్షులు, గంధర్వులు మాత్రం అదే జన్మలో తాము చేసిన తపశ్చర్యలకు అదే జన్మలో సత్ఫలితాలు అనుభవిస్తున్నారు. .. 
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com