..

Tuesday 12 November 2013

భూమండలం అంతటి మీద పుణ్యభూమి మన భారతదేశం:

భూమండలం సప్తద్వీపలతో , సప్త సముద్రాలతో అలరారుతూ వుంది. భూమండలం మధ్య భాగాన దేవతలకు నిలయమైన మేరు పర్వతం వుంది. భూమండలం చివరిన లోకాలోక పర్వతం వుంది. మధ్యన 7సముద్రాలు , 7ద్వీపాలు, ప్రతి ద్వీపమునకు కులాచలములు, చక్కని నదులు వున్నాయి. ఇక్కడి జనులు దేవతాసములు. ఈ సప్తద్వీపాలకు సప్త సంద్రములు చుట్టబడివున్నాయి. లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, దధి సముద్రం, క్షీర సముద్రం, జల సముద్రం వున్నాయి. ఉప్పు సముద్రానికి ఉత్తర భాగాన, హిమద్రికి దక్షిణ భాగాన భరత వర్షం ఉన్నది. ఇది అన్ని కర్మలను ఇస్తుంది. ఇక్కడ సదాచార ఖర్మలు చేసినవారు ముల్లోకాల్లోనూ సుఖభోగాలు అనుభవిస్తారు. ఇప్పటికీ దేవతలు ఈభారతభూమి మీదే జన్మించాలని కోరుకుంటారు. భారతభూమి భూమి మీద చేసిన పుణ్యం అక్షయం, అమలం, శుభం కలుగజేస్తాయి. ఇక్కడ ఎప్పుడెప్పుడు జన్మిడ్డామా? ఎప్పుడెప్పుడు ఆ పుణ్యకార్యాలు ఆచరిద్దామా? ఎప్పుడెప్పుడు పరమపదం చేరుదామా అని దేవతలు ఆశిస్తూ ఉంటారు. (దేవతలకి కూడా ఖర్మలు చేయకుండా ఆ శివకేశవుల సన్నిది చేరడం సాధ్యం కాదు. ఖర్మలు చేయాలంటే భూమండలంలో జన్మించాలి. అందునా ఖర్మలు ఆచరించగలిగే భారతభూమి పై జన్మించాలి.ఇంకా ఈ భూమిపైన ఎక్కడా కర్మలను ఆచరించలేరు. ఇక్కడ ఉన్నంత మంది దేవతలు గాని, సంపదలు గాని మరేచోట లేవు.). ఇక్కడ జన్మించి శ్రీహరి భక్తుడైనవాడు వీడికి సాటివచ్చేవారు ఈ ముల్లోకాలలో కానరారు. (శ్రీహరి 14లోకాలు సృష్టించి ప్రతి లోకానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలు ఇచ్చాడు. నారద పురాణం). ఇక్కడ జన్మించి పాపకృత్యములు ఆచరించేవాడు, ధర్మములు ఆచరించని వాడు, శాస్త్ర చెప్పిన కర్మలయందు ఆశక్తి లేనివాడు అధముడు మహాపాపి. అమృతకలశం వదిలి విశాభాండాలను ఆశ్రయించినవాడు. శ్రుతి, స్మృతులలో చెప్పిన ధర్మాలతో తనని పరిశుద్దుడిని చేసుకోలేనివాడు పాపులలో మొదటివాడు. కోరికలు వున్నా కోరికలు లేకపోయినా శాస్త్రములు అనుసరించి తీరవలసినదే. ఆశ్రమ ఆచారాలు, కులాచారాలు వదిలినవాడు పతితుడు. భారతభుమిపై జన్మించి ఆత్మను తరింపజేయనివాడు సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. వీడికంటే అజ్ఞాని మరొకడు ఉండడు. సదాచారాలు అవలంభించేవారు బ్రహ్మ తేజస్సుతో వృద్ది చెందుతాడు.
(ఇక్కడ ఆడవారి ప్రసక్తి ఎందుకు రాలేదంటే. వారు తమ తండ్రి కుటుంబం, తరువాత భర్త యొక్క కుటుంబానికి చెందినా ఆచార వ్యవహారాలు చూస్తారు కాని తమంతట తాముగా ఆచరించలేరు. వీరి పాపాలు రసజ్వల సమయంలో, భర్త, అత్తమామల సేవలో నశించిపోతాయి. ఇలాకాకుండా భర్తని అత్తమామలని ఎదించే గడుసు వారికి నరకమే)


Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com