..

Sunday 17 November 2013

శ్రీకృష్ణ కథామృతం..

Please Visit : http://telugupennidhi.com/index.php/te" more updates.


      కంసుడు శ్రీకృష్ణుని మేనమామ అని తెలుసుకదా! దేవకీదేవి అష్టమ గర్భం లో జన్మించిన శిశువు నిన్ను చంపేస్తాడు అని కంసుడికి ఆకాశవాణి చెప్తుంది. ఆనాటి నుండి చిత్రవిచిత్రమైన పరిస్థితులలో శ్రీకృష్ణుడు యశోద వొడిలోకి చేరతాడు. ఇది కూడా చాలామందికి తెలుసుకదా!
శ్రీకృష్ణుడు తప్పించుకున్నాడని తెలిసి ఆనాటి నుండి చంపడం కోసం కంసుడు చేయని పనిలేదు. చంపడానికి ఎందరినో పంపించాడు. కాని వెళ్ళినవారు వెళ్తున్నారే గాని తిరిగిరవడంలేదు. చివరికి విసిగి ద్వారకలో ఉండే ఒకతనిని పిలిచి విషయం చెప్తాడు. నేను కృష్ణుడిని చంపాలని చాలా ప్రయత్నాలు చేశాను. అన్నీ విఫలమయ్యాయి. ఆలోచిస్తే ఒక మార్గం కనపడింది. నువ్వు వెళ్లి శ్రీకృష్ణుడితో మీ మేనమామ తన ధనస్సుకి పూజ చేస్తున్నాడు కాబట్టి నిన్ను బలరాముడిని వెంటబెట్టుకుని రమ్మన్నాడు. అని రధం ఎక్కించుకుని తీసుకురా! ఇక్కడికి అడుగుపెట్టిన మరుక్షణంలో ఆ ద్వారం దగ్గరే ఏనుగుతో తొక్కించి చంపేద్దాం. (ఈ ఏనుగు బాగా మదించిన ఏనుగు. ఒకేసారి 10000 ఏనుగుల్ని అవలీలగా చంపేస్తుంది. అంత బలం కలిగింది)  అని చెప్పాడు. 
ఆమాట వినడంతోనే మనసులో నవ్వుకుని! ప్రభువు చెప్పింది చేయడం నాకర్తవ్యం.  నా వంతు ప్రయత్నం చేస్తాను. అయన ఇక్కడికి వచ్చిన తరువాత జరగాల్సిందే జరుగుతుంది. (ఇక్కడ కంసుడు శ్రీకృష్ణుడితో పోరాడితే చనిపోతాడని తెలుసు. అందరికి ప్రభువు శ్రీకృష్ణుడే. ఇది అయన సంకల్పం అని గ్రహించి ఇలా మాట్లాడాడు. ఈ విషయం కంసుడుకి అర్ధం కాలేదు. ఆ తరువాత ఇలా ఎత్తులు వేస్తూ ఉన్నాడు.) కంసుడు  సంతోషించి పంపించాడు. ఇక ఆరోజు రాత్రి కంసుడికి నిద్రపట్టలేదు. ఆ వేగుకి కూడా నిద్రపట్టలేదు.  కంసుడు! శ్రీకృష్ణుడు రాగానే కోటగుమ్మం దగ్గర ఆ మాధగజేంద్రం తో చంపించేస్తాను. ఒకవేళ దాన్ని దాటుకుని వస్తే! నాదగ్గర కండలు తిరిగిన మల్లయోధులు వున్నారు. ఎంతోమంది యోధానుయోదులని చంపారు. ఇంకేందరినో ఓడించారు. వీళ్ళు చంపేస్తారు. ఒకవేళ వీళ్ళని కూడా దాటుకుని వస్తే సైన్యం ఉండనేవుంది. వీరి చేతుల్లో అయినా చనిపోతారు. ఒకవేళ వీరిని కూడా దాటి వస్తే నేను ఉన్నాను. అనుకుంటూ పడుకున్నాడు గాని నిద్రపట్టడంలేదు. ఎలాగో నిద్రపోయాడు. అప్పుడు భయంకరమైన కలలు వచ్చాయి. (అదేంటో తరువాత తెలుసుకుందాం)
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com