..

Saturday 9 November 2013

ఎదుటివారిలో తప్పులని వేదకొద్దు.

 తప్పులని వెదకడం వలన సమస్యలు, శత్రువులు పెరుగుతారు. ఆరోగ్యం పాడవుతుంది గాని ఉపయోగం ఉండదు. ఒకరికి ఒక శత్రువు ఉన్నాడంటే వీడి ప్రమేయం లేకుండా శత్రువులు ఉండరు. ఇలా తప్పులని వెదికే క్రమంలో నీదైన జ్ఞానాన్ని నీలో, గుణాన్ని పదిమంది మధ్యలో కోల్పోతావు. ఎదుటివారిని పరిశీలించడమే గాని తన గురించి పట్టించుకోరు. అలాగే ఈ అలవాటు వలన వీడు ఇలాంటి వాడు అనుకుని నీస్నేహితులు సైతం దూరంగా పెట్టేస్తారు. లేదా ఏదైనా వాడుకునే వీలుంటే వాడుకుంటారు గాని ముఖ్యమైన వ్యవహారాలలో నిన్ను లెక్కలోకి తీసుకోరు. మనసెప్పుడు ఎదుటివారి గురించే ఆలోచించడం వలన మానసిక ఒత్తిడి పడి క్రమంగా అనారోగ్యం పాలౌతారు. ఎవరూ ఉత్తి పుణ్యానికి శత్రువులు కారు. ఏదో ఒక లోపం వలన శత్రువులుగా కనిపిస్తారు.
ఉదాహరణకి అవసరంలో ఉన్నప్పుడు సాయం చేయలేదని చిన్న నాటి స్నేహితుడిని శత్రువుగా చూస్తున్నారు. కాని ఆసందర్భంలో వారి పరిస్థితి ఆలోచించారా? అలాగే తీసుకున్న డబ్బులు అడిగారని శత్రువులుగా చూడటం, కోపంలో ఏదో అన్నారని శాశ్వత విరోదానికి నాంది పలకడం. ఇలా చిన్న చిన్న కారణాలకి శత్రువులు గా మారిపోతున్నారు. ఒక అమ్మాయి ప్రేమించలేదని శత్రువు,ప్రేమించిన అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయలేదని, అరిచాడని శత్రువు. ఎక్కడి నుండి వచ్చారు ఈ శత్రువులందరు? నీ మనస్సంకల్పం వలన పుట్టుకొచ్చారు. కాదంటారా? లోపం ఎదుటివారిలో కాదు. ఇవన్ని వెదుకుతున్న నీమనస్సులో ఉంది. కొన్ని నచ్చక, కొన్ని నచ్చినవి దొరక్క, మరికొన్ని అనుకున్నది తీరలేదని. ఇవే మానవులలో శత్రువులు పుట్టిస్తున్నాయి. దీనంతటికి మూలకారణం మనస్సు. నిన్ను నువ్వు సరిచేసుకో. తరువాత ఎదుటివారిలో తప్పుని చూడు. ఇలా చూడాలంటే నువ్వు పరిపూర్ణం అవ్వాలి. అలా అయితే నీకు అసలు తప్పే కనబడదు. 
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com