..

Saturday 16 November 2013

సృష్టి ప్రారంభకాలం

సృష్టి ప్రారంభకాలంలో (అంటే చాలా సృష్టి లు జరిగాయి. అయితే ఇది ప్రారంభ సృష్టి)..
 ఒక దివ్య జ్యోతి.  ఒక లక్షమంది సూర్యులు ఒకేసారి ప్రసరిస్తే ఎంత వెలుగు వస్తుందో అంత వెలుగుతో స్థిరంగా ప్రకాశిస్తూ వుంది. క్రమేపి ఒడ్లగింజ కోనంత చిన్నదిగా అయిపోయి పరిబ్రమిస్తుంది. అలా పరిబ్రమిస్తుండగా అప్పటివరకు శూన్యంతో ఉన్న విశ్వం నీటితో నిండిపోయింది. దీనినే మనం హిరణ్యగర్భం అంటాం. కొంతసేపటికి ఆవేలుగు నుండి హిరణ్య గర్బంలో ఒక తామరపువ్వు ఏర్పడింది. అందులో ఉన్న తామర తూడులో సూక్ష్మాతి సూక్ష్మంగా చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. చూస్తుండగానే పెరిగి పెద్దవాడైపోయాడు. ఎటుచూసినా తామర పువ్వు రేకులు తప్ప బ్రహ్మకి ఏమి కనబడలేదు. అప్పుడు నేను ఎవరు? ఎలా పుట్టుకొచ్చాను? చుట్టూ నీరు దానిపైన తామరపువ్వు  తప్ప ఎవరూ కనబడటంలేదు. అని ఎవరైనా కనిపిస్తారేమో అనుకుని నీటిలోకి దూకి 100సంవత్సరాలపాటు లోతుకి ప్రయనిస్తూనే ఉన్నాడు కాని ఏమి కనబడటంలేదు. ఎటువెతికినా అది అంతం కానరాలేదు. సరే అనుకుని మళ్ళి తామరపువ్వులోకి వచ్చి కూర్చున్నాడు. వయస్సు పెరగడంలేదు. ఏమి తెలియడంలేదు. ఇంతలో ఆ హిరణ్యగర్భం నుండి విరాట్ రూపుడు పుట్టుకొచ్చాడు. ఆయనే కాలుడు, కాల పురుషుడు అంటాం. ఈయన రాగానే బ్రహ్మ శరీరంలో మార్పు వచ్చింది. వయస్సు పెరగడం మొదలయ్యింది. పంచభూతాలు ఏర్పడ్డాయి. సృష్టి కొనసాగాలంటే ఏదో ఒకటి సృష్టించాలి కదా! అందుకని బ్రహ్మ కొద్దిగా మట్టిని తీసుకుని నీటిలో కలిపి ముద్ద చేసి దానికి తలా, ముక్కు, చెవులు, నోరు, అవయవాలు ఏర్పాటు చేశాడు. పంచభూతాల ని ఆహ్వానించి ఆ బొమ్మలోకి ప్రవేశపెట్టి కదులు అన్నాడు. కదలలేదు. మళ్లి కదలమన్నాడు. ఈసారి కూడా అంతే కదలలేదు. ఏంటి పంచభూతాలు ప్రవేశపెట్టాను. అయిన కదలదేమిటి అనుకుంటూ ఉంటే విరాట్రూపుడు వచ్చి పంచభూతాలు, శరీరంలో ఉన్న ప్రాణం లేకపోతె ఎలా? ప్రాణం వుండాలి కదా! ప్రతి జీవిలోనూ దైవం ఉంటేనే కదలికలు ఏర్పడతాయి. దైవం లేకుండా ఎన్ని ఏర్పాట్లు చేసినా వృధా! కనుక దైవాన్ని పిలువు అన్నాడు. సరేనని దైవాన్ని కొలిచాడు. ఎన్నో శ్లోకాలతో కీర్తించాడు. అప్పడు దైవం తన అంశని ఆ బొమ్మలో ప్రవేశపెట్టింది. ఆ బొమ్మలో కదలికలు వచ్చాయి. సృష్టి కొనసాగడం కోసం విరాట్ రూపుడు 4 పిల్లల్ని కన్నాడు. వాళ్ళకి సత్యయుగుడు, త్రేతాయుగుడు, ద్వాపరయుగుడు, కలియుగుడు అని పేర్లు పెట్టాడు.
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com