..

Saturday 9 November 2013

పార్వతీదేవి శివుడికి వివరించిన పతివ్రతా ధర్మం:

ఋతుమతి కాని పునీత వనిత కన్యక! ఆమె వివాహంలో తల్లితండ్రులు, పినతండ్రి, మేనమామ, సహోదరుడు అధికారులు. వీరిలో ఎవరైనా ఆ కన్యకకు యోగ్యుడైన వరునికి ఇచ్చి వివాహం చేయవచ్చు. వివాహం జరిగిన నాటినుండి భర్త ఒక్కడే ఆమెకి సర్వం. ప్రభువు. అతనియేడల ప్రేమతోనే అతని అనుమతితోనే ఆ మహిళ అతిధి, పితృ పూజలు (సేవ) చేయాలి.ఇటువంటి స్త్రీ పరమ పతివ్రత! ఇహ పర లోకాలలో సకల సౌక్యలు అనుభవించగలధు. ఇంకా భర్తకు ఇష్టమైన వంటకాలు అత్యంత ప్రీతితో వండి వడ్డించవలెను. అతని యెడల అనురక్తితో పూసలో దారంవలె మసలుకోవలెను. పనుల యెడల ఏమరిపాటుగాని, భర్త యెడల వ్యతిరేక దృష్టి కాని పనికిరాదు. భర్త ఆగ్రహించిన యెడల మిక్కిలి అనురక్తితో సంచరించవలెను. తన చేతికి ఇచ్చిన వస్తువుని జాగ్రత్తగా పదిలపరిచి తిరిగి అప్పగించవలెను. భర్త ఏది బహుకరించినా పరమాదరంతో స్వీకరించవలెను. కుమారునితో నైన ఏకాంత ఏకాసన స్థితి పనికిరాదు. భర్త ధనవంతుడైన, దరిద్రుడైనా, రూపసి అయినా కాకపోయినా, వివేకి అయినా అవివేకి అయినా, ఆరోగ్యవంతుడు అయిన రోగి అయినా కాంతకు ఎల్లప్పుడూ పతి అనువర్తన అత్యంత ముఖ్యము. దేవతా పితృ కార్యాలలో పతి శుభం కోరి గడప దగ్గర బలి బిక్షలు సమర్పించవలెను. సతికి పతికన్నా వేరొక ఉత్తమగతి లేదు. కనుక అతని యెడల నిరంతర భక్తి శుభపరంపరలు అందీయగలదు.

వనితల అనర్హధర్మాలు : అధర్మ మార్గంలో సంచరిస్తున్న అంగనలు ఆసురి, పైశాచి, రాక్షసి అన్న నామధేయాలు ఏర్పడినవి. ఇటువంటి మహిళలందరికీ వ్యభిచారాసక్తి మిక్కుటము.(అధికము).
అసురి: నిరంతర క్రౌర్య పరాయణత్వంతో (అవివేకం, కోపం,ఆలోచనారాహిత్యం) ధన ధాన్యాదులు తన ఇష్టం వచ్చినట్టు వినియోగిస్తుంది. చంచల స్వభావం, భోగపరాయణురాలు(అందరిలో నేను గొప్పగా బ్రతకాలి అనే చిత్తచాంచల్యం. దేనికైనా వెనకాడని తత్వం). ఈర్ష్య ఎక్కువ!
పైశాచి: దురాగ్రహం ఎక్కువ! భర్త పుత్రుల యందు ప్రేమాభిమానములు ఉండవు! ఇంటి పనులు, ఇంట్లో కార్యాల యందు ఏ మాత్రం నైపుణ్యం లేనిది. (వంట చేశాను. తింటే తింటారు. లేకపోతె వాళ్ళ ఖర్మ. చుట్టాలు వస్తే ఎడముఖం పెడముఖంగా ఉంటుంది.)
ఇక రాక్షసి : ఎప్పుడూ నిద్రే నిద్ర! ఆమె నోటివెంట అసత్యమే గాని నిజం అన్నమాట పొరపాటునకూడా రాదు. సిగ్గు, శరాలు ఉండవు.
పైన చెప్పిన వారందరూ భర్త వంశియులందరికీ పాపకళంకం అంటగట్టి ఘోరాతిఘోరమైన నరక కూపం చేరుకుంటారు. ఇహం పరం మొత్తం నరకప్రాయమే వీరికి, వీరితో ఉన్నవారికి!
ఈవిధమైన జ్ఞానం కలిగిన తరువాత పతిభక్తితో మసలుకుంటే ఇంతకుముందు వరకు చేసిన పాపలు అన్ని తొలగిపోయి పతితోపాటు స్వర్గలోకం చేరుకుంటారు.

ఈ శివపార్వతుల సంవాదం సభామధ్యమంలో వినిపించినవారు నిత్యానురత్వ వైభవం సంప్రాప్తించగలదు. శ్రద్దాభక్తులతో విన్నవారికి ఆయురారోగ్య సంపత్తి లభించగలదు.
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com