..

Monday 18 November 2013

2. శ్రీకృష్ణ కథామృతం:

Please Visit : http://telugupennidhi.com/index.php/te" more updates.     

 ఆనాటి రాత్రి కంసుడు నిద్ర పోతుండగా కలలో ఒక శవం వచ్చి కౌగలించుకున్నట్టు, ఎవరో స్త్రీ నల్లటి దేహంతో, ఎర్రటి చీర కట్టుకుని రా రా అని దగ్గరికి వచ్చేస్తున్నట్టు ఇలాంటి భయంకరమైన కలలు వచ్చాయి. కంసుడు దెబ్బకి ఉలిక్కిపడి లేచి మరలా నిద్రపోయాడు. ఆనాటి రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. ఓ పక్కన కలలు చంపేస్తున్నాయి. ఇంకోప్రక్కన శ్రీకృష్ణుడు వస్తాడు అనే ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేసి నిద్ర పాడుచేశాయి.
ఇంకా అక్రూరుడు (వేగు) మాత్రం ఎప్పుడెప్పుడు శ్రీకృష్ణుడిని చూస్తానో? ఎప్పుడూ ఎవరో  శ్రీకృష్ణుడు అంత గొప్ప, ఇంతగొప్ప, సాక్షాత్తు విష్ణువే శ్రీకృష్ణుడిగా వచ్చాడు. చాల అందంగా ఉంటాడట, సర్వం, సమస్తం ఆయనేనట! అని చెప్తుంటే వినడం తప్ప  ఇంతవరకు చూసింది లేదు. అని ఎప్పుడు తెల్లరుతుందా! ఎంత వేగంగా వెళదామా అని ఆనందపారవస్యంలో మునిగి అక్రూరుడికి నిద్రపట్టలేదు. ఎలాగైతేనేం! తెల్లారింది. లేచాడు.  ఉదయ సంధ్యావందం చేశాడు. రధాన్ని సిద్దం చేసుకుని కంసుడికి చెప్పి బయలుదేరాడు.
గుర్రాలు యమవేగంతో వెళ్తున్నాయి. అక్రూరుడికి అంతవేగం కూడా అడుగులో అడుగువేసుకుంటూ వెళ్తున్నట్టుగా ఉంది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కదా! ఎవరికీ సాధ్యం కాని శ్రీకృష్ణ సాక్షాత్కారం ఇంకొన్ని గడియలలో నాకు సాధ్యం అవుతుంది. కంసుడి పగ నాకు ఈనాడు వరం అయింది. లేదంటే శ్రీకృష్ణుడిని చుసేవాడినా? కంస మహారాజ నీకు నాధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాలు తపస్సులు చేసినా లభించని దర్శనం నాకు అవుతుంది. దేవతలకి కూడా సాధ్యంకాదు ఆయనని దర్శించడం. అలాంటిది నేను ధర్శించుకోబోతున్నాను. యుగయుగాలుగా ఎందఱో ఋషులు అయన సాక్షాత్కారం కోసం ఎన్నో యజ్ఞాలు, యాగాలు ఆచరించారు. వారికి కూడా పరమ దుర్లభమైన దర్శనం నాకు అవుతుంది. 
కాని నేను వెళ్ళగానే శ్రీకృష్ణుడు ఏమనుకుంటాడో? శత్రువు పంపిన వేగునని తిరస్కరిస్తాడో, లేక శత్రువు మీద ఉన్న కోపం నామీద చూపి సంహరిస్తాడో? ఏదేమైనా శ్రీకృష్ణుడిని చూస్తాను.  అనుకుంటూ ఇంకెంత దూరం ఇంకెంతదూరం అంటూ వస్తూ ఉండగా గుర్రాలు అంత వేగంలో పరుగెడుతూ కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి. ఏంటి ఇలా ఆగిపోయాయని అని ముందు చుస్తే అడుగుల గుర్తులు ఉన్నాయి. ఎవరివి ఈ అడుగుల గుర్తులు అని పరిశీలనగా చుస్తే ఆ గుర్తుల్లో శంకు, చక్ర, గదా, శర్గజం అనే కోదండం ఇంకా ఇతర ఆయుధాల గుర్తులు ఉన్నాయి. ఆ ఐతే ఇప్పుడే కృష్ణుడు ఇటుగా వెళ్లినట్టు ఉన్నాడు. ఆహా ఈ అశ్వాలకి ఎంత శక్తి ఉంది! సాక్షాత్తు శ్రీకృష్ణుడు పాద ముద్రలని గుర్తించి ఆ పాదాలు దాటకూడదు అని ఆగిపోయాయి. అని పరవశం చెంది క్రిందికి దిగి ఆ అడుగుల గుర్తులని ముద్దాడి శ్రీకృష్ణుడి అడుగుల గుర్తులున్న ఇసుకని వంటినిండా పూసుకున్నాడు. మళ్లి తెలివి తెచ్చుకుని అయ్యయ్యో పాదముద్రలు పాడైపోయ్యాయే! అయ్యో అనుకుంటూ లేచి ఇప్పుడే ఇటు వెళ్లినట్టు ఉన్నాడు. ఎక్కడ అని శ్రీకృష్ణుడు పాదగుర్తులు ఉన్నవైపు చుస్తే అల్లంతదూరంలో నీలివర్ణంలో, తలపై నెమలి పించంతో, చేతిలో పిల్లనగ్రోవితో, దివ్యతేజస్సుతో అన్నగారైన బలరాముడితో కలిసి గోవులదగ్గర నిలబడి ఉన్నాడు. ఆహా జన్మధన్యం అయిపొయింది అని పరుగుపరుగున వెళ్లి శ్రీకృష్ణుడి పాదాలపై సాష్టాంగ ప్రణామం చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడి వయస్సు 8సంవత్సరాలు కేవలం. శ్రీకృష్ణుడు చూసి అక్రూరుడితో మేము చిన్నవాళ్ళం. మీరు పెద్దవారు. ఇలా  మా పాదాలపై పడితే మాకు అయుక్షీణం కదా! మీకు ఏమైనా న్యాయమేనా ఇది. అన్నాడు. 
స్వామి మీముందు నేనెంత? చెట్లకి పుట్లకి వస్తాయి ఏళ్ళు. అలాగే నాకు వచ్చాయి. అవతారపురుషుడివి నువ్వు. అన్ని నీలోనే ఇమిడివున్నాయి. సృష్టి అంతటా వ్యాపించివున్నావు. చరాచర జగత్తుకి తండ్రివి నువ్వు. మిగిలునది తరువాత చెప్పుకుందాం.. 
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com